అంత్యక్రియలకు వెళ్లి వస్తూ అనంత లోకాలకు పయనం

0 5

కామారెడ్డి   ముచ్చట్లు:

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం లో అంత్యక్రియలకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్న ఇద్దరు మహిళలు పోచారం ప్రధాన కాలువ దాటుతుండగా ఒకరు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన ఘటన నాగిరెడ్డిపేట మండలంలోని రాఘవపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం,  రాఘవపల్లి గ్రామానికి చెందిన చెన్నం లలిత (46), గడ్డి మారుతి (45). వీరిద్దరూ సమీప గ్రామమైనటువంటి మాసంపల్లి గ్రామంలో అంత్యక్రియలకు హాజరై తిరిగి స్వగ్రామానికి వస్తుండగా గ్రామ సమీపాన ఉన్నటువంటి పోచారం ప్రధాన కాలువ దాటి వెళ్దామని కొత్తకుంట చెరువు సమీపంలో నీటిలోనికి దిగారని, నీటి ప్రవాహం అధికంగా ఉండటం వల్ల వీరు ఇరువురు రక్షించుకునే ప్రయత్నం చేయగా గడ్డి మారుతి కాలువ అంచు ఒడ్డుకు ఉన్నటువంటి ఒక చెట్టు కొమ్మను పట్టుకుందని, చెన్నం లలిత నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండగా మారుతి, గడ్డం యేసు ఆమెను కాపాడడానికి ప్రయత్నించగా నీటి ప్రవాహం అధికంగా ఉండటం వల్ల ప్రమాదవశాత్తు చెన్నం లలిత నీటి ప్రవాహంలో మునిగిపోయిందని, తెలియడంతో గ్రామస్తులు, బంధువులు వెళ్లి చూసేసరికి నిజముగా నీటిలో మా అమ్మ కనబడటంలేదని, ఆమె కుమారుడు రాజ్ కుమార్ తెలిపారన్నారు. ఆదివారం సాయంత్రం చీకటి కావడం వల్ల, నీటి ప్రభావం అధికంగా ఉండటం వల్ల, మా అమ్మశవం దొరకలేదని, సోమవారం ఉదయం ఆరు గంటలకు నీటిపై శవం తేలుతూ కనిపించిందని, గ్రామస్తుల సహకారంతో శవాన్ని బయటకు తీయడం జరిగిందని, మా అమ్మ మరణం పై ఎవరికైనా ఎటువంటి అనుమానం లేదని, ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన చనిపోయిందని ఆమె కుమారుడు రాజ్ కుమార్ దర్యాప్తులో పేర్కొనడంతో ఎస్ఐ ఆంజనేయులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

Tags:Going to the funeral and coming and going to the infinite worlds

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page