అనంతపూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు.. ముగ్గురు వ్యక్తులు

0 28

అనంతపూర్‌  ముచ్చట్లు:

ఏపీలోని అనంతపూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని గుత్తి జాతీయ రహదారిపై జీపు, లారీ ఢీకొట్టుకొన్నాయి. ఈ ఘటనలో జీపులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను గుల్బర్గాకు చెందిన వారిగా గుర్తించారు. జీపులో అనంతపూర్‌ నుంచి కర్నూలుకు వెళ్తుండగా రాంగ్‌ రూట్‌లో వచ్చిన లారీ కారును ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జవగా.. లారీ రోడ్డుపై బోల్తాపడింది. జీపులోనే మృతదేహాలు చిక్కుపోయాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్‌ సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులను అష్రఫ్‌ అలీ (68), లాయక్‌ అలీ (45)గా గుర్తించారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

Tags:Ghora road in Anantapur district .. Three persons

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page