అన్న తిట్టాడని నిండు గర్భిణి ఆత్మహత్య

0 10

కృష్ణా జిల్లా ముచ్చట్లు :

 

 

అన్న తిట్టాడని మనస్తాపంతో నిండు గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామంలో చోటుచేసుకుంది. మెరైన్‌ కానిస్టేబుల్‌ గొరిపర్తి పాండు రంగారావు కుమార్తె నాగ భార్గవికి (20) 15 నెలల క్రితం హైదరాబాద్‌లో చార్డెడ్‌ అకౌంటెంట్‌గా పని చేసే నెరుసు సాయి శంకర్‌తో వివాహమైంది. భార్గవి గర్భం దాల్చటంతో పుట్టింటికి వచ్చి ఉంది. నాగభార్గవి, అన్న నిఖిల్‌ ఏదొక విషయంలో వాదన పడుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆదివారం భార్గవికి, నిఖిల్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. మనస్థాపానికి గురైన నాగభర్గవి వంటింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి ఇంట్లోకి వెళ్లి చూసేసరికి నిండు చూలాలైన కుమార్తె ఉరికి వేలాడుతూ కనిపించడంతో హతాశురాలైంది.

 

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Pregnant woman commits suicide

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page