ఆగ‌స్టు 5న పుంగ‌నూరులోని శ్రీ క‌ల్యాణ‌ వెంక‌ట‌ర‌మ‌ణ‌స్వామివారి ఆల‌యంలో ప‌విత్రోత్స‌వం

0 25

తిరుపతి  ముచ్చట్లు:

 

ఇటీవ‌ల టిటిడి ప‌రిధిలోకి తీసుకున్న పుంగ‌నూరులోని శ్రీ క‌ల్యాణ‌ వెంక‌ట‌ర‌మ‌ణ‌స్వామివారి ఆల‌యంలో ఆగ‌స్టు 5న ప‌విత్రోత్స‌వం జ‌రుగ‌నుంది. ఇందుకోసం ఆగ‌స్టు 4న ఉద‌యం ఆచార్య రుత్విక్‌వ‌ర‌ణం, సాయంత్రం 6 గంట‌లకు అంకురార్ప‌ణ, వాస్తు హోమం, అగ్నిప్ర‌తిష్ట‌, కుంభ‌స్థాప‌న‌, ప‌విత్ర ప్ర‌తిష్ట‌, ఉక్త‌హోమం నిర్వ‌హిస్తారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ప‌విత్రోత్స‌వం నిర్వ‌హిస్తారు.ఆగ‌స్టు 5న ఉద‌యం యాగశాలలో వైదిక కార్య‌క్ర‌మాలు, స్నపనతిరుమంజనం, ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ చేప‌డ‌తారు. సాయంత్రం యాగ‌శాల వైదిక కార్య‌క్ర‌మాల అనంత‌రం రాత్రి 8 గంట‌ల‌కు పూర్ణాహుతి నిర్వ‌హిస్తారు.ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా పవిత్రోత్సవం నిర్వహిస్తారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

Tags:Sacred festival on August 5 at Sri Kalyan Venkataramanaswamy Temple in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page