ఆటో డ్రైవర్ మున్సిపల్ వైస్ చైర్మన్ అయ్యాడు..

0 12

నిడదవోలు ముచ్చట్లు :

 

ఆయన ఆటో డ్రైవర్‌.. ఇప్పుడు నిడదవోలు పురపాలక సంఘం రెండో వైస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆటోడ్రైవర్‌ యలగాడ బాలరాజును వైస్‌ చైర్మన్‌గా ఎంపికచేయడంపై అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పురపాలక సంఘాల్లో ఇద్దరు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు ఉండాలనే నూతన ఒరవడికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టడంతో నిడదవోలు పట్టణంలో బాలరాజును పదవి వరించింది. యలగాడ వెంకన్న, రాములమ్మ ఆరుగురు సంతానంలో మూడో కుమారుడు బాలరాజు. తాజా మున్సిపల్‌ ఎన్నికల్లో 13 వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి 385 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

 

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Auto driver becomes municipal vice chairman.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page