ఇంటిగ్రేటెడ్డ్ మార్కెట్ ఏర్పాటు కృషి చేస్తా

0 5

ఫిష్ మార్కెట్ అభివృద్ధికి భూమి పూజ
మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి
జగిత్యాల  ముచ్చట్లు:

తెలంగాణ ప్రభుత్వం మత్స్య కారుల సంక్షేమానికి  కృషి చేస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి  అన్నారు.సోమవారం జగిత్యాల పట్టణంలోని  రైతు బజార్ లో చేపల మార్కెట్ లో అభివృద్ధి పనుల కోసం రూ. 15 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తున్నట్లు చైర్ పర్సన్  తెలిపారు.  రైతు బజార్ లో చేపల మార్కెట్ అభివృద్ధి పనులు కోసం ఫిష్ కట్టింగ్ కోసం నూతన షెడ్ నిర్మాణం, డ్రైనేజి మరమ్మతులు, టైల్స్ ఏర్పాటు, హోల్సేల్ దుకాణాలు, కోల్డ్ స్టోరేజ్, చేపల కట్టింగ్, రిటైల్ వ్యాపారం కోసం, విద్యుత్, వాటర్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని  కోరారని తెలిపారని అన్నారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్   మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ సహకారంతో పాటు పురపాలన శాఖ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత , నాయకత్వంలో  జగిత్యాల అభివృద్ధికి ఎప్పుడు పనిచేస్తుందని చైర్పర్సన్ అన్నారు.

- Advertisement -

గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రజలకు అనుకూలంగా సౌకర్యవంతంగా ఉండేందుకు మార్కెట్ ను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, మత్స్య కారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు పై అమ్మకాలు, చేపట్టకుండా, నూతనంగా ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.  రైతు బజార్ మార్కెట్ గత  పాలకుల నిర్లక్ష్యం కారణంగా కొన్ని సంవత్సరాలుగా మూత పడి ఉన్న, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ , జిల్లా కలెక్టర్ రవి సహకారంతో  పునప్రారంభం చేసుకుని చేపల మార్కెట్ నిర్మించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. జగిత్యాల పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండేలా మార్కెట్ లను  అభివృద్ధి పనులు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు టవర్ దగ్గర, అంగడి బజార్, రైతు బజార్ లో అందుబాటులో ఉండేలా  కల్పించిందన్నారు. గతంలో   రైతు బజార్లో రూ. 17 లక్షలతో షెడ్లు ఏర్పాటు చేశామని, వ్యాపారం చేసుకునేందుకు సౌకర్యం కల్పించనున్నారు. త్వరలో ఎమ్మెల్యే డా, సంజయ్ సారధ్యంలో ఇంటిగ్రేటెడ్డ్ మార్కెట్ చేసుకునేందుకు అనుకూలంగా రైతు బజార్ ను అభివృద్ధి  చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రైతు బజార్లో  ఇతర ప్రాంతాలకు కూరగాయలను ఎగుమతి, దిగుమతి రవాణ చేసుకోవడానికి సౌకర్యంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ కమిషనర్ లక్ష్మీనారాయణ, స్థానిక కౌన్సిలర్ చుక్క నవీన్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు సిరికొండ పద్మ సింగరావ్, కుసరి అనిల్, కూతురు రాజేష్, తోట మల్లికార్జున్, పిట్ట ధర్మరాజు, బొడ్ల జగదీశ్, తెరాస పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్, కో.ఆప్షన్ శ్రీనివాస్, నాయకులు డిష్ జగన్, బండారి నరేందర్, కూతురు శేఖర్ , కాశెట్టి తిరుపతి, జయంత్ నేత, మత్సకారుల సంఘం అధ్యక్షుడు కొండ్ర శంకర్, వారి కార్యవర్గం, ఏ.ఈ ఆయుబ్ ఖాన్, టీఎంసీ రజిత, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:Will work to establish an integrated market

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page