ఉక్కు ఉద్యమానికి మేయర్ మద్దతు

0 11

విశాఖపట్నం  ముచ్చట్లు:
విశాఖ ఉక్కు కర్మాగారానికి వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్నాయి.విశాఖలో జీవిఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఐ నేతలు చేపట్టిన నిరసనకు జీవిఎంసీ మేయర్ హరి వెంకట కుమారి మద్దతు ప్రకటించారు.నిరసనలో పాల్గోన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ,పార్టీ నేతలు .. కేంధ్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే..విశాఖ నామరూపాలు లేకుండా పోతుందన్నారు. ఢిల్లీ వెళ్లిన ఉక్కు కార్మికులు, నేతలను అక్కడ పోలీసులు ఇబ్బందులు పెడితే.. రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ను పట్టించుకోకుండా.. రాజకీయాలు చేయాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు.ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం దురదృష్టకరమని, అందుకే నిరసన దీక్ష చేస్తున్నామని మరోవైపు మేయర్ హరి వెంకట కుమారి చెప్పారు.స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

- Advertisement -

Tags:Mayor supports the steel movement

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page