ఎమ్మెల్యే కు రాజీనామా చేస్తా

0 18

హైదరాబాద్   ముచ్చట్లు:
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. గోషామహాల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీమానా చేయటానికి తాను రెడీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రాజసింగ్. గోషామహాల్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వేల కోట్లు నిధులిస్తే రాజీనామా చేస్తాను. గోషామహాల్ ఉప ఎన్నికల్లో ఎవరకు గెలుస్తారో తేల్చుకుందామని కేసీఆర్‌కు ఎమ్మెల్యే సవాల్ చేశారు. రాజీనామా చేయమని నా నియోజకవర్గం ప్రజలు ఒత్తిడి చేస్తున్నారన్నారు.అయితే ముఖ్యమంత్రి తన నియోజకవర్గానికి నిధులు ప్రకటించిన వెంటనే తాను స్పీకర్ ను కలసి రాజీనామా లేఖ ఇస్తానని సవాల్ చేశారు రాజా సింగ్. గోషామహాల్ లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద ఓసీలకు సైతం పది లక్షలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ నిధులన్నీ ఎంఐఎం కోసమే కేసీఆర్ ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఉప ఎన్నిక వస్తే కేసీఆర్ కు బడుగులు, రైతులపై ప్రేమ వస్తోందని దుయ్యబట్టారు ఎమ్మెల్యే రాజసింగ్.

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

- Advertisement -

Tags:Will resign as MLA

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page