ఏడు ఎమ్మెల్సీల కోసం క్యూ

0 10

హైదరాబాద్  ముచ్చట్లు:
తెలంగాణలో ఏడు ఎమ్మెల్సీ పదవులు భర్తీ కానున్నాయి. వీటిని ఆగస్టు నెలలో భర్తీ చేసే అవకాశముంది. ఆగస్టు చివరి నాటికి ఈ ఎన్నికలను పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ కూడా భావిస్తుంది. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీలో మళ్లీ పదవుల హడావిడి మొదలయిందనే చెప్పాలి. హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఉండటంతో ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావహుల సంఖ్య కూడా బాగా పెరిగిందనే చెప్పాలి. దీనిపై కేసీఆర్ కసరత్తులు ప్రారంభించినట్లు తెలిసింది.తెలంగాణలో ఏడు ఎమ్మెల్సీ పదవులు భర్తీ కానున్నాయి. ఆగస్టు చివరినాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. శాసనసభ్యుల కోటాలో ఆరు, గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ పదవి భర్తీ చేయాల్సి ఉంది. ఈ పదవులన్నీ అధికార టీఆర్ఎస్ కే దక్కనున్నాయి. అయితే రెన్యువల్ కోసం పదవి నుంచి దిగిపోయిన వారు ఎక్కువ మంది ప్రయత్నాలు చేస్తున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి తదితరులు తిరిగి తమకు ఎమ్మెల్సీ పదవి కేసీఆర్ కేటాయిస్తారని ఆశలు పెట్టుకున్నారు.తోడు హుజూరాబాద్ ఉప ఎన్నిక రావడంతో ఎంతో మంది ఆశావహులు పదవుల కోసం పుట్టుకొచ్చారు. సామాజికవర్గాల వారీగా ఈ పదవులను భర్తీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అలాగే ప్రాంతాల వారీగా సమతూకం ఉండేందుకు కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణను పార్టీలో చేర్చుకున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న హామీని కేసీఆర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.అలాగే సీనియర్ నేతలు సయితం ఈ పదవుల కోసమే వేచి చూస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు, మధుసూదనా చారి వంటి నేతలు ఎమ్మెల్సీ పదవి తమకే దక్కుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం తమను ఎమ్మెల్సీ చేస్తుందన్న ధీమా వారిలో కన్పిస్తుంది. సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా కూడా కేసీఆర్ ఎమ్మెల్సీ హామీని కొందరికి ఇచ్చారు. మొత్తం మీద పదవులు ఏడు ఉండగా పోటీ పడేవారు మాత్రం పదుల సంఖ్యలో ఉండటం విశేషం. మరి కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది..

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

- Advertisement -

Tags:Queue for seven emls

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page