ఏపీలో కొత్తగా 2,287 కరోనా కేసులు

0 11

అమరావతి ముచ్చట్లు :

 

రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 85,856 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,287 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 410 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 377 కేసులు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 299, గుంటూరు జిల్లాలో 231 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 28 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 2,430 మంది కరోనా నుంచి కోలుకోగా, 18 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,395కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,68,462 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 19,34,048 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 21,019 మంది చికిత్స పొందుతున్నారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: 2,287 new corona cases in AP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page