కడపలో ప్లేబాయ్…

0 26

కడప ముచ్చట్లు:
పేరు ప్రసన్నకుమార్‌. కేరాఫ్‌ కడప. క్వాలిఫికేషన్ విషయానికొస్తే బీటెక్ మధ్యలోనే ఆపేశాడు. మైండ్ మాత్రం మహా ముదురు. ఆ తెలివి తేటలను పనికొచ్చేవాటికి వాడి ఉంటే బాగుపడేవాడు. కానీ అడ్డగోలు పనులు చేసి నాశనం అయ్యాడు.. చాలామంది జీవితాలు నాశనం చేశాడు. వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలిపోద్దట. అలాగే బయటపడింది వీడి బాగోతం. ఒకరిద్దరు కాదు.. 300 మంది యువతులను ట్రాప్ చేశాడని టాక్. ఇతగాడి తెలివి తేటలకు ఎవరికి వారు.. తేలు కుట్టిన దొంగల్లా ఉన్నారు.. కానీ ఒక వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్‌తో మొత్తం చిట్టా బయటపడింది. 200 మంది కాలేజీ అమ్మాయిలు.. వందమంది వివాహితలు, మహిళలను ట్రాప్ చేశాడట.. !ప్రసన్న కుమార్‌ ట్రాపింగ్‌కు వాడిన అస్త్రం సోషల్ మీడియా. ఫేక్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్‌, షేర్ చాట్ లాంటి వాటిల్లో వేరువేరు పేర్లతో లాగిన్ అయ్యేవాడు. పోష్‌ పర్సన్‌గా, రిచ్‌గాయ్‌గా బిల్డప్ ఇచ్చుకునేవాడు. పెద్ద అందంగా ఏమి ఉండడు.. కానీ ఫోటోలను నీట్‌గా ఎడిట్ చేసి, మార్ఫ్ చేసి.. వాటికి మాయమాటలు జోడించేవాడు. ఆ మాటలతో.. ఫోన్‌కాల్స్‌ దాకా, ఆడియో కాల్స్ నుంచి వీడియోకాల్స్ దాకా తీసుకొచ్చేవాడు. న్యూడ్ కాల్స్‌ దాకా వెళ్లేవాడు. ఆ తర్వాత వాటిని రికార్డ్ చేసి.. బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టేవాడు. ఇలాగే అక్షరాలా 300 మందిని ముంచేసినట్లు తెలుస్తోంది. ఒకరికి తెలియకుండా మరొకర్ని ఎన్ని రకాలా వంచించాలో అన్ని రకాలుగా వంచించాడట. కొందరితో అయితే శారీరక సంబంధాలు కూడా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అందరూ మోసపోయారు కాబట్టి.. బయటపెడితే వాళ్ల వ్యవహారం కూడా బయటపడుతుంది కాబట్టి.. సైలెంట్‌గా ఉండిపోయారు. కానీ.. ఓ వ్యక్తి  జాబ్ ఇప్పిస్తానని మోసం చేశాడంటూ ఇచ్చిన ఫిర్యాదుతో ఈసారి ట్రాపింగ్ పోలీసులు మొదలు పెట్టారు. పట్టేసుకుని పాత చిట్టా కూడా రివ్యూ చేశారు.గాళ్స్ ట్రాపర్.. అని ఇంతవరకూ కథతో తెలుస్తుంది. కానీ వీటితోపాటు మరిన్ని ఘన కార్యాలూ ఉన్నాయి. 2017 నుంచి ప్రసన్నకుమార్ ఖాతాలో అనేక కేసులున్నాయి. దొంగతనాల్లోనూ ఆరి తేరిన ఇతగాడు.. ఏ ఇంటికి తాళం వేసి ఉంటుందో కూడా చెప్పగలడు. దానికీ సోషల్ మీడియానే వాడుకున్నాడు. ఎవరైనా జర్నీ డీటేల్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. వెళ్లి ఆ ఇంటి బీరువాలు బద్దలుకొట్టేవాడు. అందిన కాడికి దోచుకునే వాడు. పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కూడా లక్షా 26వేల డబ్బు, 30 గ్రాముల బంగారు ఆభరణాలు దొరికాయి. గతంలో మూడు నాలుగు పోలీస్ స్టేషన్‌లలో కేసులు ఉండడంతో అరెస్ట్ అయ్యాడు. జైలుకు కూడా వెళ్లొచ్చాడు. అయినా బుద్ధిమారలేదు సరికదా.. ఈసారి సోషల్ మీడియాను మరింత ఎక్కువ వాడుకోవడంలో రాటుదేలిపోయాడు.. !.. చూశారుగా అమ్మాయిలూ మాయగాళ్లతో తస్మాత్ జాగ్రత్త..!

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

- Advertisement -

Tags:Playboy in Kadapa …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page