కృష్ణా నది తీరం అప్రమత్తం

0 7

పర్యాటకులు  రావద్దని ఆర్డీవో సూచన
గుంటూరు ముచ్చట్లు:

 

 

నాగార్జున సాగర్ ప్రాంతంలో  లో 144 సెక్షన్ అమల్లో ఉంది. పర్యాటకులు ఎవరు నాగార్జునసాగర్ కి రావద్దని గురజాల ఆర్డీఓ జగన్నాథం పార్థసారథి సూచించారు. కృష్ణా వరద నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తుతున్న నేపథ్యంలో నదీ పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులు వేటకు నదిలోకి వెళ్ళవద్దు. మహిళలు బట్టలు ఉతకడానికి నదీ పరివాహాక ప్రాంతాలకు వెళ్ళరాదు. నదీ తీరంలోని గొడ్ల, గొర్రెల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని అయన అన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతం మండలాలైన మాచర్ల, రెంటచింతల, గురజాల, దాచేపల్లి, మాచవరం మండలాల తాసిల్దార్ లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశాం. దాచేపల్లి మండలం రామాపురం లో ఉన్న 48 మత్స్యకార కుటుంబాలను  పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాం. మాచవరం మండలం లోని వెల్లంపల్లి, భోధనం, కేతవరం గ్రామాలను ఖాళీ చేయించడం జరిగింది. పులిచింతల బ్యాక్ వాటర్ వచ్చే ప్రమాదం ఉన్న గ్రామాల్లో అధికారులను పూర్తిగా అప్రమత్తం చేశాం. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తదనుగుణంగా చర్యలు చేపడుతున్నాం. వరద వల్లన ఎవరైనా ప్రజలు ఇబ్బందులకు గురవుతుంటే సంబంధిత రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని అయన అన్నారు.

 

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags:Krishna river bank alert

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page