కేంద్రం కోర్రీలతో ఇబ్బందులు

0 10

విజయవాడ  ముచ్చట్లు:
కృతి వైపరీత్యాలతో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి తీసుకునే రుణాలకు సైతం కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతోంది. దీంతో మంజూరైన అప్పు కూడా రద్దవుతోంది. అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వ వైఖరివల్ల రూ.442 కోట్ల అప్పు రద్దైంది. మరో రూ.186 కోట్ల పనులు నిలిచిపోయాయి. అనునిత్యం తుపానులతో అతలాకుతలమయ్యే రాష్ట్రానికి ఈ పరిస్థితి మిరగుడుపడడం లేదు. తుపాన్లతో నష్టపోయిన ప్రాంతాల్లో పునర్‌నిర్మాణంతో పాటు, ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రపంచబ్యాంకుతో రూ.2,220 కోట్ల మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీనిలో 250 మిలియన్‌ డాలర్ల రుణాన్ని ప్రపంచబ్యాంకు ఇవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించిన రూ.442 కోట్ల రుణాన్ని ప్రపంచబ్యాంకు రద్దు చేసుకుంది. కరోనా తదితర కారణాలతో ఈ మొత్తంతో చేపట్టాల్సిన పనులు ఆలస్యమయ్యాయని అధికారులు అంటున్నారు. ఇటువంటి సమయంలో ప్రపంచబ్యాంకుతో మాట్లాడి గడువు పెంపునకు సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం దానికి భిన్నంగా రద్దుకు సిఫార్సు చేసిందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వమే సిఫార్సు చేయడంతో ప్రపంచబ్యాంకు కూడా ఆ మేరకు రుణాన్ని రద్దు చేసినట్లు సమాచారం. అప్పు రద్దుకావడంతో ఆ మొత్తంతో చేపట్టాల్సిన పలు పనులను కూడా నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు డైరెక్టర్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ ఎఫైర్స్‌ శాఖ నురచి ఆదేశాలు వచ్చినట్లు చెబుతున్నారు. రద్దయిన పనుల్లో అనేకం విశాఖపట్నంలో ఉన్నాయి. వీటిలో పరచాయితీరాజ్‌ శాఖకు చెరదిన హైలెవెల్‌ వంతెన ఒకటి. దీనికి సిఆర్‌జెడ్‌ అనుమతి సకాలంలో రాకపోవడం వల్ల రద్దు చేయాల్సి వచ్చిరది. అలాగే రూ.40 కోట్ల విలువైన విశాఖలోని తెన్నేటి పార్క్‌ బీచ్‌ అభివృద్ధి, రూ.27 కోట్లతో చేపట్టాల్సిన విశాఖ జూ పనులు, రూ.50 కోట్లతో అమలు చేయాల్సిన రాష్ట్ర డిజాస్టర్‌ మేనేజ్‌మెరట్‌ అథారిటీలో డ్రోన్‌ ఆధారిత లిడర్‌ సర్వే పథకం కూడా ఉన్నాయి. వచ్చిన రుణాన్ని సకాలంలో ఖర్చు చేయకపోవడం, పనులు నత్తనడకన చేస్తుండటం వంటి రాష్ట్ర ప్రభుత్వ తప్పులు కూడా రుణం రద్దు కావడానికి కారణమని సమాచారం. హైలెవల్‌ వంతెనకు సిఆర్‌జెడ్‌ అనుమతి కేంద్రమే ఇవ్వాలని, దానిని సకాలంలో ఇవ్వకుండా జాప్యానికి కేంద్రమే కారణమైందని, ఇటువంటి పనులు అనేకం ఉన్నాయని రాష్ట్ర అధికారులు అంటున్నారు.

 

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

- Advertisement -

Tags:Trouble with center cores

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page