గోదావరిలో పడి వ్యక్తి మృతి..

0 25

కుక్కునూరు ముచ్చట్లు:

కుక్కునూరు మండలంలోని పెదరావిగూడెం గోదావరి పుస్కారాల ఘాట్ లో కాలు జారీ పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. కుక్కునూరు ఎస్సై  తెలిపిన వివరాల మేరకు..
పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండల పరిధిలోని పెదరావి గూడెం గోదావరి పుష్కర ఘాట్ వద్ద ఆదివారం బోయనపల్లి రాజ్ కుమార్ (35) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. రాజ్ కుమార్
తెలంగాణలోని అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామం. అయితే కొన్నేళ్లుగా సత్తుపల్లిలో టీ పాయింట్ నడుపుతూ ఒక పత్రికలో రాజ్ కుమార్ జర్నలిస్టుగా పని చేస్తున్నాడు. రాజ్ కుమార్ కొందరు మిత్రులతో కలిసి  కుక్కునూరు మండలం పెదరావిగూడెం గ్రామంలోని జామాయిల్ నర్సరీలో జామాయిల్ మొక్కలను కొనుగోలు చేయడానికి వచ్చి పెదరావిగూడెం గ్రామ సమీపంలోని గోదావరి నదిని చూడడానికి వెళ్లి పుస్కారాల ఘాట్లో ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడి మునిగిపోయాడు. రాజకుమార్ గోదావరిలో జారి పడినప్పుడు ఆయనతో పాటు ఉన్న మిత్రులు గాలించిన రాజ్ కుమార్ దొరకక పోవడంతో కుక్కునూరు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడానికి వెళ్లారని తెలిసింది. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం రాత్రి నుండి గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం సాయంత్రం 4 గంటల సమయం రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైందని తెలిపారు. సంఘన స్థలానికి కుకునూరు ఎస్సై శ్రీనివాసరావు వెళ్లి రాజ్ కుమార్ మృతదేహాన్ని వెలికి తీసి శవ పంచనామా నిర్వహించి పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:Man dies after falling in Godavari

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page