చిత్తూరు జిల్లా నందు భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలు స్వాధీనం..

0 19

చిత్తూరు ముచ్చట్లు:

సుమారు 5 కోట్ల రూపాయల విలువ గల 11 టన్నుల బరువు గల 388 ఎర్రచందనం దుంగలు, 3 వాహనాలు స్వాధీనం మరియు 4 గురు ఎర్రచందనం అంతరాష్ట్ర స్మగ్గ్లర్ లు అరెస్ట్
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా సంబంధించి చిత్తూరు జిల్లా ఎస్ పి ఎస్. సెంథిల్ కుమార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు జాయింట్ డైరెక్టర్ SEB V. విద్యాసాగర్ నాయుడు, ఐ.పి.ఎస్ స్వీయ పర్యవేక్షణలో ఎర్రచందనం అక్రమ రవాణా పై ప్రత్యేక నిఘా ఉంచి వేరు వేరు బృందాలను ఏర్పాటు చేయడం అయినది. అందులో భాగంగా 01-08-2021 వ తేదిన రాబడిన పక్కా సమాచారం మేరకు పీలేరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.మురళీకృష్ణ పర్యవేక్షణలో సాయత్రం సుమారు 5.00 గం. ల సమయంలో రొంపిచెర్ల ఎస్.ఐ A.హరిప్రసాద్, భాకరాపేట WSI శ్వేత, ఎర్రవారిపాలెం SI పి.వెంకటమోహన్ వారి సిబ్బంది దేవరకొండ గుడి, దేవరకొండ గ్రామం, చిన్నగొట్టిగల్లు మండలం వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా దేవరకొండ గుడి వైపు ఒక కారు అతివేగంగా నడిపి వాహనాన్ని ఆపకుండా ముందుకు పోనిచ్చాడు,

 

 

 

 

- Advertisement -

కారును వెంబడించి పట్టుకొని తనిఖీ చేయగా అందులో 8 ఎర్రచందనం దుంగలను గుర్తించి, భాకరాపేట పోలీసు స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు లో భాగంగా అదుపులో తీసుకొన్న ఎర్రచందనం స్మగ్లర్ ను విచారించగా క్రింద కనబరచిన ఎర్రచందనం స్మగ్లర్ లు కొంత మంది స్మగ్లర్ ల తో కలుసుకొని ట్యాంక్ ఫ్యాక్టరి, ఆవడి, చెన్నై నందు గల కన్నన్ ఫార్మ్ హౌస్ నందు గోడౌన్ ను ఏర్పాటు చేసినట్లు తెలుసుకొని, 02-08-2021 వ తేది ఉదయం జిల్లా ఎస్.పి ఆదేశాల మేరకు పీలేరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.మురళీకృష్ణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ N.విక్రం, దిశా పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్, K.మురళి మోహన్, రొంపిచెర్ల ఎస్.ఐ A.హరిప్రసాద్, భాకరాపేట WSI శ్వేత, ఎర్రవారిపాలెం SI వెంకటమోహన్, RSI శ్రీనివాసులు, స్పెషల్ పార్టి లతో ప్రత్యేక బృందాలు ఏర్పరచి దాడులు నిర్వహించగ అక్కడ ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్ లను, ఇతర దేశాలకు ఎగుమతి కి సిద్దంగా ఉంచిన సుమారు 11 టన్నుల బరువు గల 380 ఎర్రచందనం దుంగలను, ఒక లారి మరియు ఒక కారు ను స్వాధీనం చేసుకోవడం అయ్యినది. స్వాధీనం చేసు కొన్న ఎర్రచందనం దుంగలు మరియు వాహనాలు కలిపి సుమారు 5 కోట్లు వరకు ఉంటుంది.

 

 

 

ముద్దాయిల వివరములు
1. M.మనోజ్ కుమార్ వయస్సు- 27 సం.లు, s/o M.మాణిక్యం మొండి అమ్మనగర్ రెడ్ హిల్స్ చెన్నై తిరువళ్ళూరు జిల్లా తమిళనాడు రాష్ట్రం
2. M. అశోక్ కుమార్, వయస్సు-26 సం.లు s/o M.మాణిక్యం మొండి అమ్మనగర్ రెడ్ హిల్స్ చెన్నై తిరువళ్ళూరు జిల్లా తమిళనాడు రాష్ట్రం.
3. ఎస్.శంకర్వ యస్సు-27 సం.లు s/o బిల్లా ట్యాంక్ ఫ్యాక్టరి ఆవడి చెన్నై, తిరువళ్ళూరు జిల్లా తమిళనాడు రాష్ట్రం
4. L.దయానంద నాయుడు, వయస్సు-37 సం.లు, s/o లేట్ ఆదికేశవులు నాయుడు ఐతే పల్లె చంద్రగిరి మండలం చిత్తూరు జిల్లా

 

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Large quantity of red sandalwood logs seized in Chittoor district.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page