జాతీయ  జెండా రూపకర్త  పింగళి వెంకయ్య జయంతి

0 9

కోసిగి  ముచ్చట్లు:
అఖిల భారత విద్యార్థి సమాఖ్య   ఆధ్వర్యంలో కస్తూర్బ గాంధీ హాస్టల్ ప్రధాన ఉపాధ్యాయురాలు పుష్పలత చేతులు మీదుగా హాస్టల్ నందు మొక్కలు నాటారు.ఈ సందర్బంగా జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్.ఈరేష్ మాట్లాడుతూ
పింగళి వెంకయ్య ఆంధ్ర ప్రదేశ్ కృష్ణాజిల్లా బట్ల పెనుమర్రు గ్రామంలో ఆగస్టు 2న జన్మించారు.1936 నాటి ‘యంగ్‌ ఇండియా’ పింగళి వెంకయ్యను ప్రత్యేకంగా గాంధీజీ ప్రశంసించారు. 19 ఏళ్ల వయసులోనే  ఆఫ్రికాలో ఆంగ్లో-బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే మహాత్ముడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 50 ఏళ్ల పాటు అది కొనసాగింది. వెంకయ్య సన్నిహితులు ఆయన్ను జపన్ వెంకయ్య, పత్తి వెంకయ్య, జనద వెంకయ్య అని పలు రకాలుగా పిలుచుకునేవారు.
పింగళి  వెంకయ్య గొప్ప దేశభక్తుడు, జియాలజిస్ట్, రచయిత కూడా. 1911-44 వరకు బందరు జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు చేసి డిప్లొమా పొందారు. 1924 నుంచి 1944 వరకు నెల్లూరులో మైకా గురించి పరిశోధనలు చేశారు. బొగ్గు వజ్రంగా మారే విధానాన్ని గురించి ‘తల్లిరాయి’ అనే పుస్తకం రాశారు. 1916లో ‘భారతదేశానికి ఒక జాతీయ పతాకం’ అనే పుస్తకాన్ని రచించారు. ఈ గ్రంథంలో సుమారు 30 రకాల పతాకాలను ప్రదర్శించారు.బెజవాడ  1921లో అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభలు జరిగినప్పుడు గాంధీజీ.. వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు, మధ్య రాట్నం గల ఒక జెండాను రూపొందించాలని కోరారు.సూచనాలతో ఒక జెండాను వెంకయ్య రూపొదించగా.. సత్యం, అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని  అభిప్రాయపడ్డారు. దీంతో వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించారు.
ప్రోద్బలంతో త్రివర్ణపతాకం పుట్టింది బెజవాడలోనే. కాషాయం హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో, ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో  ఆకుపచ్చ, కాషాయ రంగులుతో పాటు తెలుపు రంగు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని పింగళి వెంకయ్య గారు రూపొందించారు. మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింపజేస్తుందన్నారు. కార్మిక, కర్షకులపై ఆధారపడిన భారతదేశం, సత్య హింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం. ఆగస్టు 2న ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుడి సేవలను స్మరించుకుందాం. ఈ కార్యక్రమంలో, Aisf నాయకులు హాజీ, మంజునాథ్ ,అంజి. జోన్షన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

- Advertisement -

Tags:National flag designer Pingali Venkayya Jayanti

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page