తిరుమలలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను తనిఖీ చేసిన‌ సివిఎస్వో

0 25

తిరుమల ముచ్చట్లు:

 

 

తిరుమలలో వివిధ ప్రాంతాల్లో, అలిపిరి న‌డ‌క మార్గంలో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను సోమ‌వారం టిటిడి సివిఎస్వో  గోపినాథ్ జెట్టి ఇంజనీరింగ్, అట‌వీ, విజిలెన్స్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు.ఈ సంద‌ర్భంగా సివిఎస్వో జిఎన్‌సి సమీపంలోని పాత వ్యూ పాయింట్‌ను సందర్శించి, అక్క‌డ అవ‌స‌ర‌మైన అభివృద్ధి, పచ్చదనం పెంపొందించేందుకు చెప‌ట్ట‌వ‌ల‌సిన ప‌నుల‌ను ఇంజనీరింగ్, అటవీ అధికారులకు సూచించారు. తరువాత జిఎన్‌సి సమీపంలోని ప‌న‌స వనం, ఔటర్ రింగ్ రోడ్‌లోని అభివృద్ధి పనులను ప‌రిశీలించారు.

 

 

- Advertisement -

త‌నిఖీల్లో పునరుద్ధరించిన ఘూర్ఖా పోస్ట్ :

 

సివిఎస్వో తనిఖీలో భాగంగా అలిపిరి న‌డ‌క‌మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆల‌యం ప్రక్కన ఆధునీక‌రించిన గూర్ఖా సెక్యూరిటీ పోస్ట్‌ని సందర్శించారు. ఇదివ‌ర‌కు ఆయ‌న తనిఖీ సమయంలో ఘాట్ రోడ్ విధుల్లో ఉన్న ఘూర్ఖాస్‌కి ఉండే ఈ సెక్యూరిటీ పోస్ట్ సౌక‌ర్య‌వంతంగా లేదని గమనించి ఆధునీక‌రించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అన్ని వ‌స‌తుల‌తో ఆధునీక‌రించిన ఘూర్ఖా పోస్ట్‌ను ప్రారంభించారు.ఈ సంద‌ర్భంగా నేపాల్, డార్జిలింగ్ మొదలైన ప్రాంతాలకు చెందిన ఘూర్ఖాస్ రాత్రి, ప‌గలు విశేషంగా సేవలు అందిస్తున్నార‌ని ప్రశంసించారు. త‌రువాత వారితో కలిసి సివిఎస్వో భోజనం చేశారు.తనిఖీలో ఎస్ఇ- 2 జగదీశ్వర్ రెడ్డి, డిఎఫ్‌వో చంద్రశేఖర్, ఈఈ 1  జగన్మోహన్ రెడ్డి, విజివో  బాలి రెడ్డి, ఎవిఎస్వోలు  గంగరాజు,  పవన్ కుమార్,  శైలేంద్ర ఉన్నారు.

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: CVSVO inspects development works in Thirumala

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page