దర్శకుడు, నటుడు గిరిధర్ కన్నుమూత

0 25

తిరుపతి ముచ్చట్లు :

 

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకుడు, నటుడు ఇరుగు గిరిధర్ కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. ఆరేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గిరిధర్ అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యారు. నిన్న తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. టాలీవుడ్ సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి, గుణశేఖర్, ఈవీవీ సత్యనారాయణ వంటివారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా గిరిధర్ పనిచేశారు. గుడుంబా శంకర్, అన్నవరం, వన్, సుప్రీమ్, వరుడు వంటి సినిమాలకు కోడైరెక్టర్‌గానూ పనిచేశారు. శుభముహూర్తం సినిమాకు దర్శకత్వం వహించి విజయాన్ని అందుకున్నారు. గిరిధర్ మృతికి తెలుగు సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

 

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Director, actor Giridhar Eyelid

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page