దళిత బందు కు మద్దతుగా సీఎం కేసీఆర్ కి దళిత సంఘాల నాయకులు పాలాభిషేకం

0 11

హైదరాబాద్  ముచ్చట్లు:

 

సరూర్ నగర్ డివిజన్ లోని అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ దళిత సంఘాల ఐక్య పోరాట సమితి అధ్యక్షులు బెర బాలకిషన్  పూలమాలవేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దళిత బంధు ద్వార  అర్హులైన వారికి 10 లక్షల రూపాయలు అందించడం దళితుల అభివృద్ధికి కేసీఆర్ చేస్తున్న కృషికి నిదర్శనమని అన్నారు. హుజూర్ నగర్ ఎన్నికల తర్వాత అన్ని బంధు అని ఇతర పార్టీ నాయకులు చెప్తున్న మాయమాటలను దళితులు నమ్మొద్దని అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిని దళిత బంధు పథకాన్ని తెలంగాణలో దళితుల అభ్యున్నతి,దళితుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు. దళిత బంధు పథకం అనేది తెలంగాణలో ప్రతి దళితకు పండుగ రోజని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, దళితులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

Tags:Leaders of Dalit communities anointed CM KCR in support of Dalit Bandhu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page