నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యతలు వహించాలి

0 6

కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు తిరుమల గంగాధర్

కోరుట్ల ముచ్చట్లు:
రాష్ట్రంలోని ,నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యతలు వహించాలని కోరుట్ల కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు తిరుమల గంగాధర్ ఆన్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావు ఆదేశాల మేరకు సోమవారం పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్ అధ్యక్షత పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పట్టణ అధ్యక్షులు.
మాట్లాడుతూ హుజూరాబాద్ లో ఆదివారం
రైలు ట్రాక్ పై పడుకోని ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి మహ్మద్ షబ్బీర్ ఆత్మహత్యకు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.డిగ్రీ,ఐటీఐ చదివినా ఎలాంటి ఉద్యోగం రావటం లేదని, మనస్థాపంతో తెలంగాణ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న హుజురాబాద్ నియోజకవర్గ ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన నిరుద్యోగి మహమ్మద్ షబ్బీర్ ఇది ముమ్మాటికి రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వ హత్యేనని
ఆరోపించారు. తెరాస ప్రభుత్వం 2018 ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చారని , అదేవిధంగా బీజేపీ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల్లో సంవత్సరంకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారని , ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని యువకులు ఉన్నత స్థాయి చదువులు చదువుకొన్నారని ,కాని ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వడంలేదని ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ రావడం లేదని తెలంగాణలో యువకులు ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని , ఇది ముమ్మాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల హత్యేనని ఆయన అన్నారు.
హైచ్ ఆర్సీ సుమోటగా కేసు స్వీకరించి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలపై హత్య నేరం కింద కేసు నమోదు చేయాలన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారని 7సంవత్సరం కాలం గడుస్తూన్నా ఖాళీలు లక్ష తొంభై వేల ఖాళీలు అయ్యాయని మీ కూతురు కవిత ఎంపీగా ఓడిపోతే సంవత్సర కాలం కూడా ఖాళీ ఉంచలేక పోయారని, ఎమ్మెల్సీ ఉద్యోగం కట్టబెట్టారని మరి గరిబోళ్ల పిల్లలు పొట్ట చేతబట్టుకొని ఒక్కపూట తిని పిల్లలకు చదివిస్తే ప్రభుత్వ విధానం వల్ల ఉద్యోగాలు రావని భావనతో ఆత్మహత్యలకు కారణం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వం ఉసిగొల్పుతుందని ఈ చర్య మానుకోవాలని తెలంగాణ యువకులు ఎవ్వరు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆత్మహత్యలతో సమస్య పరిష్కరం కాదని పోరాడుతే విజయం సాధిస్తామని మీ పక్షాన పోరాటం చేస్తామని , మాతో కలిసి ప్రభుత్వ మెడలు వంచి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేవరకు పోరాడుదామని అన్నారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఇంటికో ఉద్యోగం ఇచ్చి ,ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని,అలాగే ఆత్మహత్య చేసుకున్న మహ్మద్ షబ్బీర్ కుటుంబానికి యాభై లక్ష రూపాలు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వారి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షలు ఎంఏ. నయిమ్, మాజీ పట్టణ అధ్యక్షుడు ఏఆర్ అక్బర్,ప్రధాన కార్యదర్శి మ్యాకాల నర్సయ్య, నాయకులు చిట్ మెల్లి రంజిత్ గుప్తా, రసూల్, శ్రీనివాస్, శేఖర్ ,నరేశ్ ,అబ్బు, తైసిన్ ,రిజ్వాన్, సత్యనారాయణ ,ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:The central and state governments should be held responsible for the suicides of the unemployed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page