నిరుపేదల పాలిట పెన్నిధిగా నిలిచిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

0 6

మహబూబ్ నగర్  ముచ్చట్లు:

నిరుపేదలు.. నిర్భాగ్యులు అసహాయుల తో పాటుగా ప్రతిభ కలిగి సరస్వతీ కటాక్షం ఉన్నా లక్ష్మీ కటాక్షాన్ని కి నోచుకోని నిరుపేద విద్యార్థులు మరియు చదువుల్లో ఆటల్లో పాటల్లో ఇలా అన్ని రంగాల్లో ప్రతిభ కలిగి ఆర్థిక చేయూత కోసం ఎదురుచూస్తున్న వారికి దేవరకద్ర శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఆలా వెంకటేశ్వర్ రెడ్డి గారు కొండంత అండగా నిలిచి వారిని అన్ని రకాలుగా ఆదుకుంటూ అపర దాన కర్ణుడు గా ప్రజల నుంచి జేలు..జేలు అందుకుంటున్నారు. తన తండ్రి అయిన ఆల రఘుపతి రెడ్డి పేదల బతుకులు బాగు చేయడానికి ఎంతగా పరితపించారో అంతకు రెట్టింపుగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నిరుపేదల బాగోగుల కోసం నిరంతరం శ్రమిస్తూ జనం కోసం ఆరాట పడే కోవలో తండ్రిని మించిన తనయుడు గా ప్రజల నుంచి చక్కటి మన్ననలు పొందుతున్నారు. సహజంగా రాజకీయ నాయకులు అంటే ప్రజలను ఓట్లు వేసే యంత్రాలుగా భావిస్తూ ఎన్నికల సమయంలో లో మాత్రమే  ప్రజలమధ్య ఉంటూ వారిపై ప్రేమలు కురిపిస్తాడని చెడ్డపేరు ప్రస్తుత రాజకీయ నాయకులపై ఉంది. కానీ దీనికి పూర్తి భిన్నంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఇ రాజకీయం అంటేనే ప్రజలకు సేవ చేయడం అన్న సిద్ధాంతాన్ని నరనరానా జీర్ణించుకుని నిరంతరం వారి మేలు కోసం పరితపిస్తుంటారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి  సహాయం కోరి ఆయన గడప తొక్కిన వారు ఇప్పటివరకు ఖాళీ చేతులతో తిరిగి నిరాశగా వెళ్లలేదు అని జనం ఎమ్మెల్యే ఆళ్ల పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నిరంతరం ప్రజల కోసం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పడే తపన చూసి జనం మురిసిపోతున్నారు. ఒక నాడు ఎడారి ప్రాంతాన్ని తలపించే దేవరకద్ర నియోజకవర్గం ప్రస్తుతం కోనసీమ ప్రాంతం ని తలదన్నేలా గల గల పారే సెలయేళ్ళు పచ్చని పైర్లు కలకలలాడే అన్నదాతల సంతోషాల మధ్య ఉందంటే అది ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి యొక్క ఘనత అని ప్రజలు కొనియాడుతున్నారు.
రాష్ట్ర మున్సిపల్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గత మూడేళ్లుగా గిఫ్ట్ ఏ స్మైల్ ఈ కార్యక్రమం కింద పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరో ఆపన్నులకు అభయ హస్తం అందిస్తున్నారు. తన పుట్టినరోజు నాడు పూలు బొకేలు స్వీట్లు ఇతర హంగామా చేయకుండా పేదలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ గత మూడేళ్లుగా పిలుపునిస్తూ వస్తున్నారు. మంత్రి కేటీఆర్ సూచనల మేరకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగుతూ ఎందరో అభాగ్యులకు అండగా నిలిచి నేనున్నానంటూ వారిలో కొండంత భరోసా ఇస్తున్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేపడుతున్న సేవా కార్యక్రమాలు చూసి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు సైతం దీనిపై ఎలాంటి విమర్శలు చేయకుండా సైలెంట్ గా ఉన్నారు అంటే ఆయన కార్యక్రమాలకు ప్రజల ఆమోదం ఎంత ఉందో మనం ఊహించుకోవచ్చు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తండ్రి ఆల రఘుపతి రెడ్డి నుంచి ఆయన ఈ సేవా భావం అలవర్చుకున్నారు అని సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించకపోవడం మానవత్వం కాదన్న తన తండ్రి చెప్పిన మాటలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఆల వెంకటేశ్వర్ రెడ్డి సేవా కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగిస్తున్నారు. ఈ నెల 24న మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఇ ఇద్దరికీ దాదాపు మూడున్నర లక్షలకు పైగా ఆర్థిక సహాయం అందించి వారికి కొండంత అండగా నిలిచారు.
దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్రెడ్డి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద తన గొప్ప మనసు చాటుకున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:MLA Venkateshwar Reddy is the penniless of the poor

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page