నిలిచిపోయిన రోడ్డు పనులు చేపట్టాలి ఎంపిడివో కు సర్పంచ్ చిన్నబాబు వినతి పత్రం

0 10

విశాఖపట్నం  ముచ్చట్లు:
అరకు వేలి మండలం సుంకర మెట్ట పంచాయితీ సమగ్ర అభివృద్ధి కోసం మండల అభివృద్ధి అధికారి ఎంపిడిఓ  సుంకరమెట్ట సర్పంచ్ గెమ్మెలి చిన్న బాబు   చర్చించడంతో పాటు  సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సుంకరమెట్ట పంచాయతీలో ప్రధానమైన సమస్యలు అన్ని గ్రామాలకు  పరిష్కారం కోసం సబ్ ప్లాన్ నిధులు, రూర్బన్ నిధులు పూర్తిస్థాయిలో కేటాయించి పంచాయతీ సమగ్ర అభివృద్ధి కోసం  కృషి చేయాలని కోరారు.. అలాగే రైతులు సాగుచేస్తున్న పంట పొలాలకు సకాలంలో నీరు అందించడం కోసం చెక్ డ్యాం లు మరమ్మతులు చేయలన్నారు . కిన్నంగుడ నుండి దండ బాడు మీదుగా దుక్కగుడ వరకు పెండింగ్లో ఉన్న రోడ్డు పనులు వెంటనే చేపట్టాలన్నారు బస్కి పంచాయతీ కొర్రాగుడ నుండి లింబగుడ వరుకు ఉన్న రోడ్డు సమస్య పరిష్కారం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గెమ్మెలి చిన్న బాబు  సిపిఎం నాయకులు పాంగి రాజు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు తదితరులు పాల్గొన్నారు..

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

- Advertisement -

Tags:Stopped road works have to be undertaken
Sarpanch Chinnababu’s petition to MPDVO

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page