పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

0 787

పుంగనూరు ముచ్చట్లు:

 

పేద ప్రజలకు వైద్యసేవలు అందించాల్సిన ప్రభుత్వాసుపత్రిలో నర్సుల్లో గ్రూపు రాజకీయాలు ప్రారంభమై తరచుగా ఘర్షణలు జరగడంతో వైద్యం వీధినపడింది. ఇలా ఉండగా సోమవారం విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్న నర్సును ప్రశ్నించినందుకు ఏకంగా మెడికల్‌ ఆఫీసర్‌పై నర్సు దాడి చేసిన సంఘటన పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. ఇందుకు సంబంధించి మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ చిర్మిల తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. మెడికల్‌ ఆఫీసర్‌ ఉదయం 6 మంది మహిళలకు ప్రసవం చేయించి, చాంబర్‌లోకి వెళ్లారు. ఈ సమయంలో డ్యూటిలో ఉండాల్సిన నర్సు నాగలక్ష్మీ సెల్‌ఫోన్‌లో మాట్లాడుకుంటు రోగులకు వైద్యసేవలు అందించకపోవడంతో మెడికల్‌ ఆఫీసర్‌ మందలించి చాంబర్‌లోకి వెళ్లారు. దీనిపై ఆగ్రహించిన నర్సు నాగలక్ష్మి చాంబర్‌లోకి దూరి మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసి, దుర్భాషలాడి, చిరను చించివేసి, విధులకు ఆటంకం కలిగించిందని మెడికల్‌ ఆఫీసర్‌ తెలిపారు. గతంలో ప్రభుత్వానికి సరెండర్‌ అయిన నర్సులు మధుబాల, పద్మావతి, నాగలక్ష్మి కలసి తిరుగుబాటు చేసేవారని, దీనిపై తాను ఫిర్యాదు చేయడంతో ఆమె కక్షకట్టి తనపై దాడి చేసిందని మెడికల్‌ ఆఫీసర్‌ తెలిపారు. ఈ విషయమై మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, జిల్లా అధికారులకు , పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు మెడికల్‌ ఆఫీసర్‌ తెలిపారు.

 

- Advertisement -

గత నెలలోఇద్దరు నర్సులు ప్రభుత్వానికి సరెండర్‌….

ప్రభుత్వాసుపత్రిలో గత ఆరు నెలలుగా గ్రూపు రాజకీయాలు చేస్తూ, ప్రజలకు వైద్య సేవలు అందించకుండ మెడికల్‌ ఆఫీసర్‌పై తిరుగుబాటు చేసిన హెడ్‌ నర్సు మధుబాల, మరో నర్సు పద్మావతిని గత నెలలో జిల్లా కలెక్టర్‌ హరినారాయణ్‌ ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. ఆ సమయంలో నాగలక్ష్మిపై కూడ అనేక ఆరోపణలు రావడంతో మెడికల్‌ ఆఫీసర్‌ అప్పట్లో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా సదరు నాగలక్ష్మి తాను ఆనారోగ్యంతో ఉన్నానని ఆసుపత్రిలోనే చికిత్సలు చేసుకున్నారు.

 

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

Tags: A nurse who attacked a medical officer fell on a medical street in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page