పుంగనూరులో సచివాలయాలు ఆదర్శంగా ఉండాలి -చైర్మన్‌ అలీమ్‌బాషా

0 152

పుంగనూరు ముచ్చట్లు:

 

ప్రజల ముంగిటకు ప్రభుత్వ సేవలు అందించాలన్న లక్ష్యంతో సచివాలయ వ్యవవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, పుంగనూరులో సచివాలయాల పనితీరు ఆదర్శవంగా ఉండాలని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలో సచివాలయ ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమాన్ని కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. చైర్మన్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన సచివాలయాల వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదన్నారు. ఇలాంటి వ్యవస్థ ద్వారా ప్రజలకు అన్ని రకాల సేవలు అందించే బాధ్యతలను మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేపట్టారని కొనియాడారు. రాష్ట్రంలో రెండన్నర లక్షల మందికి సచివాలయాలలో ఉద్యోగాలు లభించిందన్నారు. ప్రతి ఒక్కరు తమ పనితీరును మెరుగుపరచుకుని, ప్రజలను చిరునవ్వుతో పలకరిస్తూ, అర్హులైన వారందరికి సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో శిక్షకులు కృష్ణమరాజు, ఈశ్వర్‌కుమార్‌రెడ్డి, మెప్మా కోఆర్డినేటర్‌ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Secretariats in Punganur should be ideal -Chairman Aleem Basha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page