పోలవరానికి అడగడుగునా కోర్రీలు

0 9

విజయవాడ ముచ్చట్లు:

 

పోలవరం ప్రాజెక్టుకు సంబందించిన నిధులపై కేంధ్రప్రభుత్వం పార్లమెంట్‌లో చేసిన ప్రకటన ప్రాజెక్టు నిర్మాణంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపనుంది. 2014 నాటి అంచనా విలువలకు మించి అదనంగా ఇవ్వలేమంటూ కేంద్రం చేసిన ప్రకటనతో పునరావాసం, జలవిధ్యుత్‌ ఉత్పత్తి కేంద్ర పనులు ప్రశ్నార్థకంగా మారాయి. జాతీయ ప్రాజెక్టు గా ప్రకటన చేసిన తరువాత అన్ని అంశాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిఉంది. దీనికి భిన్నంగా సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలో ఎక్కడా లేనివిధంగా పోలవరం విషయంలో కేంద్రం వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఏ నిర్మాణం అయినా ఆలస్యం అయితే అంచనాలను సవరించడం రివాజు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి సవరించిన నిర్మాణ వ్యయాన్ని రూ 55,548.87 కోట్లు (డిపిఆర్‌2) అవసరం కాగా కేంద్ర 2013-14 నాటి అంచనా మేరకు రూ 20,398కోట్లను మాత్రమే కేంద్రం ఇస్తామంటోంది. హెడ్‌వర్క్స్‌తో పాటు స్పిల్‌వే, కాఫర్‌డ్యామ్‌తో పాటు పునరావాసం అంచనాలను కేంధ్రప్రభుత్వ అనుమతితోనే అంచనాలను సవరించారు. సవరించిన అంచనాల డిపిఆర్‌ను కేంద్రప్రభుత్వ పరిధిలోని సిడబ్ల్యుసి, సాంకేతిక సలహా కమిటీలు కూడా ఆమోదించాయి. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నిరంతర పర్యవేక్షణతో రూపొందిన ఈ డిపిఆర్‌ 2కు కేంద్రం మొండిచెయ్యి చూపడంతో ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో వున్న రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి మరింత ఘోరంగా మారనుంది.సవరించిన అంచనాలకు ఆమోదం లభిస్తే రూ.34,489 కోట్లు అదనంగా వస్తుంది. పెరిగిన మొత్తంలో ఎక్కువగా 2013 పునరావాస చట్టం ప్రకారం పునరావాసానికే ఖర్చు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. పునరావాసం కోసం ఇప్పటిదాకా రూ 6,371 కోట్లు ఖర్చుచేయగా, ఇంకా రూ 26,796 కోట్లు అవసరం ఉందన్నది డీపీఆర్‌-2 అంచనా. జాతీయ హౌదా రావడానికి ముందు ఖర్చు చేసిన రూ 4,730 కోట్లు లెక్కల్లోకి తీసుకోమని, మిగిలిన రూ 15,668 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం వాదిస్తోంది. పోలవరం ప్రాజెక్టులో 2007 నుండి పునరావాసం పనులు ఇప్పటికీ 10శాతం కూడా పూర్తి కాని పరిస్థితి వుంది. పోలవరం పునరావాసంను మొదటిఫేజ్‌ కింద చేపట్టిన 41.15మీటర్ల పరిధిలో ఐదు మండలాల్లో 234 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఇందులో 18,622 కుటుంబాలు ముంపుకు గురవుతు న్నాయి. వీరికి 73 ప్రాంతాల్లో పునరావాసగ్రామాలను నిర్మిస్తున్నారు. పునరావాసం పనులు నత్తనడకన నడుస్తుండ టంతో ఇప్పిటిదాకా కేవలం 3,920 కుటుంబాలను మాత్రమే తరలించారు. ఇటీవల కాఫర్‌ డ్యామ్‌ ప్రభావంతో నీళ్లు వెనక్కు రావడంతో గ్రామాల్లోకి నీరు వచ్చేసింది. పునరా వాసం అందకుండానే గ్రామాలను నీళ్లు చుట్టుముట్టడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కొండలు గుట్టలను ఆశ్రయించాల్సివచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రంచేసిన ప్రకటన నిర్వాసితులకు కూడా ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

Tags:Corries at every turn to Polavaram

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page