ప్రభుత్వ యునాని వైద్యశాలకు మిక్సీ పంపిణీ

0 8

గోనెగండ్ల ముచ్చట్లు:

 

ప్రభుత్వ యునాని వైద్యశాలలో ఆనందయ్య మందు తయారీ కొరకు వస్తు సామగ్రిలో భాగంగా మిక్సీ అవసరం ఉందని తెలుసుకొని వ్యాపారి ప్రసాద్ శెట్టి యునాని వైద్యులు డాక్టర్ ఎస్.ఎ.ఎస్ ఖాద్రి కి అందించారు, ఈ సంధర్బంగా యునాని వైద్యులు ఖాద్రి మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా యువకులు  ఆరోగ్యవంతమైన గ్రామం కోసం ముందుకు రావడం హర్షణీయమన్నారు, వ్యాపారి ప్రసాద్ శెట్టి మాట్లాడుతూ భయానక కరోనా భారినపడి  ఎందరో మిత్రులు మృత్యువాత పడ్డారని అలాంటి పరిస్థితుల్లో ఆనందయ్య మందు ఎందరికో  ఉపశమనం కలిగించిందని ఎక్కడో తయారు చేస్తున్న ఆనందయ్య మందు కోసం వ్యయ ప్రయసాలు పడి  ఇబ్బందులు పడే బాధను డాక్టర్ ఖాద్రి తగ్గించారని రాయలసీమ జిల్లాల నుంచి  మొట్టమొదటి ఆనందయ్య మందుకు డేమోను అందించిన వైద్యులు మండల ప్రజలకు వైద్యం అందించడం ప్రజల అదృష్టం అన్నారు, గోనెగండ్లలో మందు తయారీ కోసం సిద్ధంగా ఉన్న వస్తు సామగ్రి లేనందున మందు తయారీ చేయడం లేదనే సమాచారం తెలిసి మిక్సీ పంపిణీ చేసినట్లు తెలిపారు, గోనెగండ్ల మండల ప్రజలందరికి  ఆనందయ్య మందు అనుక్షణం అందుబాటులో ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Mixi distribution to Government Unani Hospital

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page