బునాదిగాని కాల్వ ను పరిశిలించిన సీపీఐ నేతలు

0 2

మోత్కూరు   ముచ్చట్లు:
దశాబ్దల కాలంగా పెండింగ్ లో ఉన్న బునాదిగాని కాల్వను త్వరగా పూర్తి చేయాలని లేదంటే త్వరలో ఉద్యమిస్తామని ఆత్మకూరు మండల బునాదిగాని కాల్వను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పరిశీలించారు.  చా డ వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…. మొత్తం 98 కి.మీ.ల ప్రాజెక్ట్ లో 53 కి.లు మాత్రమే పూర్తి చేయడం జరిగిందని ఇంకా 35 కి.మీ.లు పెండింగ్ లో ఉందని  23 ఏళ్లుగా ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉండడం శోచనీయం అన్నారు. కేవలం 98 కి.మీ ల బునాదిగాని కాల్వ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి 23 ఏళ్లు పట్టడం చూస్తే అసలు మనం ఏ దేశంలో ఉన్నామని ప్రశ్నించారు. కేవలం 95 కోట్ల రూపాయల నిధులతో పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ ప్రభుత్వాలు మారుతున్న కొద్ది కాల్వ ప్రాజెక్ట్ పనులు రీ డిజైనింగ్ పేరుతో మార్పులుచేర్పులతో జాప్యం చేయడం దానికి అనుగుణంగా మెటీరియల్ ఖర్చులు పెరగడం జరుగుతుంది అన్నారు. త్వరలో ప్రభుత్వం బునాదిగానీ కాల్వను పూర్తి చేయకుంటే రైతులతో కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

- Advertisement -

Tags:CPI leaders inspecting the Bunadigani canal

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page