భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో వెల్లిపోయింది..!

0 17

హర్యానా ముచ్చట్లు :

 

ఆమెకు పెళ్లి జరిగి 8 సంవత్సరాలు.. ఇద్దరు పిల్లలు.. సాఫీగా సాగిపోతున్న సంసారం.. అలాంటి సమయంలో ఆమె ఎదురింటి వ్యక్తితో ప్రేమలో పడింది.. భర్త, తండ్రి నచ్చచెప్పినా వినలేదు.. చక్కని సంసారాన్ని వదులుకుని ప్రియుడితో వెళ్లిపోయింది.. అనంతరం ప్రియుడి సహాయంతో భర్తనే బెదిరించింది.. దీనిని భరించలేకపోయిన భర్త దారుణానికి పాల్పడ్డాడు.. ఇద్దరు పిల్లలను చంపేసి తను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.. హర్యానాలోని కర్నల్ జిల్లాలో జరిగింది. కర్నల్ జిల్లాలో బాద్సో గ్రామానికి చెందిన సుఖ్వీందర్ సింగ్, సిమా దంపతులకు ఇద్దరు పిల్లలు. కొన్ని రోజుల క్రితం సీమా తమ ఎదురింట్లో ఉండే కరణ్‌బీర్‌తో ప్రేమలో పడింది. భర్తను, పిల్లలను పట్టించుకోకుండా అతడితో విహార యాత్రలకు వెళ్లేది. ఈ విషయం తెలిసి భర్త, అతని తరఫువారు ఆమెను మందలించారు. చక్కని సంసారాన్ని పాడు చేసుకోవద్దంటూ సీమా తండ్రి కూడా ఆమెకు నచ్చచెప్పాడు. అయినా ఆమె వినలేదు. గత నెలలో ఇంట్లోని బంగారం, డబ్బు తీసుకుని కరణ్‌బీర్‌తో వెళ్లిపోయింది.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Husband leaves two children and goes away with boyfriend ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page