మండల అభివృద్ధి కమిటీల ద్వారా ఆదర్శ వంతమైన అభివృద్ధి-  ఎమ్ఎల్ఎ పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి

0 5

తంబళ్లపల్లె ముచ్చట్లు:

మండలాల అభివృద్ధి కమిటీల ద్వారా తంబళ్లపల్లె నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో ఆదర్శవంతమైన అభివృద్ధి చేస్తామని తంబళ్లపల్లె శాసన సభ్యుడు పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి  పేర్కొన్నారు. సోమవారం తంబళ్లపల్లె మండల పరిషత్తు కార్యాలయంలో మండల అభివృద్ధి కమిటీ నిర్వహించిన సమావేశంలో ఎమ్ఎల్ఎ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అన్ని శాఖల అధికారులతో కలసి అభివృద్ధి కమిటీల సభ్యులు, సర్పంచిలు, వివిధ శాఖల ఛైర్మన్లు, గ్రామాల వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులు అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి పథకం అర్హులైన ప్రతి ఒకరికి అందేలా చూడాలన్నారు. హామీలు కాకుండా ఆచరణలో చూపడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మల్లయ్య కొండ అభివృద్ధి, పెద్దేరు ప్రాజెక్టు ఉద్యాన వనాల అభివృద్ధి, ప్రతి పల్లెకు సిమెంట్, తారు రోడ్లు, మురుగు నీటి కాలువల నిర్మాణం, నవరత్నాల ఫలాలు, వైఎస్సార్ చేయూత, భరోసాలతో ప్రతి కుటుంబానికి అన్ని విధాలా వైకాపా ప్రభుత్వం మేలు చేస్తోంది. అభివృద్ధి కమిటీల సభ్యులు (ఎంపీటీసీలు), గ్రామాల సచివాలయాల అధికారులు, ఉద్యోగులు, వాలంటీర్లు, సర్పంచిలు, ఇంటింటికీ వెళ్ళి సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని, అన్ని విధాలా సహకారం అందిస్తామని ఎమ్ఎల్ఎ పేర్కొన్నారు.

 

- Advertisement -

కరోనా కష్టకాలంలో వాలంటీర్లు, దాతలు, ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది, పోలీసులు, అన్ని శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు చేసిన, చేస్తున్న కృషి మరువలేనిది, మూడో విడత కరోనాపై కూడా అదే పద్దతి, అదే తెగింపుతో పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కరోనా నియంత్రణ విషయంలో ధైర్యంగా పోరాడుతున్న వారందరికీ ఎమ్ఎల్ఎ అభినందనలు తెలిపారు. మండల అభివృద్ధి కమిటీ ఛైర్మెన్ బి.అనసూయమ్మ, భర్త నారాయణ రెడ్డి, ఎంపీడీవో దివాకర్రెడ్డి, తహశీల్దార్ భీమేశ్వరరావు, తంబళ్లపల్లె, పరసుతోపు సర్పంచిలు నీలూఫర్, పార్వతమ్మ, ఎంపీటీసీ సభ్యులు కరీం, సరోజమ్మ, కోసువారిపల్లె ఎంపీటీసీ సభ్యురాలు చిటికి శ్యామలమ్మ, కోఠి రెడ్డి, మల్లయ్య కొండ ఛైర్మన్ కేఆర్ మల్ రెడ్డి, ఆర్బీకే ఛైర్మెన్ రెడ్డి మల్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రజని భర్త సురేంద్ర, సింగిల్ విండో ఛైర్మన్ భార్గవ రెడ్డి, సర్పంచిలు కోట కొండ కవిత, కన్నెమడుగు మహేష్, కొటాల రామకృష్ణ, బాలి రెడ్డి గారి పల్లె అప్పి రెడ్డి, గోపిదిన్నె జయమ్మ, ఎద్దులవారిపల్లె కరీముల్ల భార్య, గుండ్లపల్లి కళావతి, సర్పంచిలు బాలి రెడ్డి గారి పల్లె (మాజీ ఎంపీపీ)వేణుగోపాల్ రెడ్డి, కోసువారిపల్లె విజయలక్ష్మి, గోపిదిన్నె సుధాకర్ రెడ్డి, కొటాల సహదేవరెడ్డి, కన్నెమడుగు దేవరింటి శ్యామలమ్మ, మరిమాకుల పల్లె జ్యోతి, ఆర్ ఎన్. తండా చెన్నకేశవ రెడ్డి, జుంజురపెంట చండ్రాయుడు, గుండ్లపల్లి మౌలాలీ, గంగిరెడ్డిపల్లి లలిత, అన్నగారిపల్లె ఉదయ్ కుమార్ రెడ్డి, కోట కొండ అరుణ, రేణిమాకుల పల్లె మహబూబ్ బాషా, ఎద్దులవారిపల్లె నాయుడు, ఎర్ర సాని పల్లె భద్ర భార్య సుగుణ,కుక్కరాజుపల్లె రామ రాజు, పంచాలమరి నాగేష్, రెడ్డి కోట మహిళా సర్పంచి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags:Ideal development by zonal development committees-
MLA Peddireddy Dwarakanatha Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page