మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోండి సీజేఐ హితవు

0 24

న్యూఢిల్లీ  ముచ్చట్లు:
తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయితీపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ జలవివాదంపై తాను తీర్పు చెప్పలేనని సీజేఐఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. మధ్యవర్తిత్వానికి అంగీకరిస్తే చీఫ్ జస్టిస్ బెంచ్ ఈ అంశంలో సహాయపడుతుందన్నారు. మధ్యవర్తిత్వం కాకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలనుకుంటే.. వేరే ధర్మాసనం ముందు వాదనలు వినిపించాలని తెలుగు రాష్ట్రాల తరపు లాయర్లకు సూచించారు. ఇరువురు తమ నిర్ణయాన్ని తెలియజేయాలన్నారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.అంతకముందు బోర్డు పరిధిని నిర్ణయిస్తూ ఇప్పటికే కేంద్రం గెజిట్‌ విడుదల చేసినందున ఏపీ పిటిషన్‌పై విచారణ అవసరం లేదని తెలంగాణ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. అక్టోబర్‌ నుంచి గెజిట్‌ అమల్లోకి వస్తుందని.. ఈలోపు నీటిని తెలంగాణ వాడుకునే అవకాశం ఉందని.. తక్షణం గెజిట్‌ అమలు చేయాలని ఏపీ తరపు లాయర్ వాదించారు. నాలుగు నెలలపాటు నీటిని నష్టపోకూడదనే అడుగుతున్నామన్నారు.ఈ వాదనలపై స్పందించిన సీజేఐ.. జల వివాదంపై గతంలో వాదించిన అనుభవం దృష్ట్యా మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి ఇంకా ఏమైనా సూచనలు కావాలంటే విచారణ వాయిదా వేసి మరో ధర్మాసనానికి బదిలీ చేస్తామన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వైఖరిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపైనే ఈ విచారణ జరిగింది.

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

- Advertisement -

Tags:Settle through mediation
CJI interest

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page