మాటలు చెప్పి కోతలు కోయడం లో కెసిఆర్ దిట్ట: పొన్నాల

0 5

దళిత బంధు రాష్టం మొత్తం ఇవ్వాలి
హైదరాబాద్ ముచ్చట్లు:
సహజంగా  ఉపఎన్నికల వస్తుంటాయి కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి లో ఉండి కేవలం  ఉప ఎన్నికల నేపద్యంలో ఈ సమీక్షలు ఏంటని ? మాజీ మంత్రి కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు.సోమవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ దేశంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కి ఒక్క ప్రత్యేకత ఉంది ..ఈయన తెలంగాణ కి ముఖ్యమంత్రి గా ఉన్నారో, కేవలం ఉపఎన్నికల కోసం ముఖ్యమంత్రి ఉన్నారో అర్ధం కావడం లేదన్నారు. రాత్రి బాగా లేట్ గా ప్రగతి భవన్ లో చర్చలు జరిగి ఉంటాయి .. కాబట్టి ఈ రోజు హాలియలో మీటింగ్  లేట్ అయింది అనుకుంటున్నా నని ఎద్దేవ చేసారు. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమియై పోయాయి ..వాటిపైన సమీక్షలు  ఎక్కడ !, గత 7 సంవత్సరరాలు గా ఇచ్చిన హామీలు ఏమైపోయాయి …వాటిపైన  సమీక్షలు పెట్టె సమయం కేసీఆర్ కి దొరకాలేదా ? అని ప్రశ్నించారు. రాష్టంలో కొన్ని సంవత్సరాలుగా పొడు భూముల పై గిరిజనులు అల్లాడుతుంటే పట్టించుకోకుండా …ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. గతంలో హుజుర్ నగర్  ఉప ఎన్నికల సమయంలో 15 రోజుల్లో పొడు భూముల పై సమీక్షలు చేస్తా అన్నావు ప్రజా దర్బర్ పెడుతా అన్నావు ఏమైందన్నారు. ఉప ఎన్నికల ఉన్న దగ్గర తప్ప రాష్ట్రంలో ఎక్కడైనా సమీక్ష లు పెట్టారా! నాగార్జున సాగర్ లో ఎడమ కాలువ నీరు సహజంగా జులై 15 లోపు విడుదల చేయాల్సి ఉంది కాని , మీరు నిన్న  విడుదల చేసారు… ఎవరికి ఉపయోయం లేకుండా సముద్ర పాలు చేశారు . రైతులకి ఉపయోగం లేకుండా పోయింది …నువ్వారైతుల గురుంచి మాట్లాడేది ! దళిత బంధు కుటుంబానికి 10 లక్షలు ఇస్తున్న అన్నారు ..కాంగ్రెస్ పార్టీ  రాష్టం మొత్తం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాము మీరు పూర్తి స్థాయి లో దళిత కుటుంబానికి ఇస్తా అన్నటువంటి దళిత బంధు రాష్టం మొత్తం ఇవ్వాలంటే  లెక్కలు చూసి అందరికి ఇవ్వడానికి కనీసం 30 సంవత్సరలు పడుతుంది డబల్ బెడ్ ఇల్లు ఏమైపోయాయని ప్రశ్నించారు. కేసీఆర్ దళిత బంధు కాదు ,దళిత ద్రోహి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు ఇప్పటికి దాని మాటే లేదు ! చెపిన మాటలు చెయ్యరు కానీ కేవలం మీ హామీలు మాటలకే పరిమితము అయ్యాయి ! కేవలం 10 లక్షలు మాట చెప్పి హుజురాబాద్ లో ఉన్న దళిత ఓటర్లు ని మోసం చేస్తున్నారు  అన్ని సామాజిక వర్గాలకు మోసం చేయడం లో మీకు మీరే దిట్ట  మీరు ముమ్మాటికి తెలంగాణ ద్రోహి అని పొన్నాల పేర్కొన్నారు.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

- Advertisement -

Tags:’KCR bold in cutting words: Ponnala

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page