మా వైయస్సార్ కాలనీ కు త్రాగునీరు , మౌళిక వసతులు కల్పించాలి

0 18

తిరుపతి ముచ్చట్లు:

 

ఆర్డీఓ కు విన్నవించిన వైఎస్ఆర్ నగర్ వాసులు తిరుపతి రూరల్ మండలంలోని వేదాంతపురం గ్రామంలోని వై ఎస్ ఆర్ నగర్ (బాయమ్మ తోట) లో నివాస ముంటున్న దళిత బడుగు బలహీన వర్గాల కు చెందిన నిరుపేద లకు త్రాగునీరు మరియు మౌళిక వసతులు కల్పించాలని “ఆమ్ ఇన్సాఫ్ ముస్లిం సమాజ్ (ఎయిమ్స్)” సెంట్రల్ కమిటీ అధ్యక్షులు షంషేర్ సయ్యద్ , ప్రజా నేస్తం అధ్యక్షులు ఎన్. రాజా రెడ్డి ఆధ్వర్యంలో కాలనీ వాసులు సోమవారం తేదీ : 02 08 2021 ఉదయం * 11 గంటలకు తిరుపతి రెవెన్యూ డివిజనల్ అధికారి కనక నరసా రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా షంషేర్ సయ్యద్ మాట్లాడుతూ “దళిత బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుపేదలు తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం గ్రామ లెక్క దాఖలా సర్వే నంబర్ 251/1 లో సుమారు గత 15సం. రాల నుండి చిన్న చిన్న రేకుల ఇండ్లు కట్టుకొని కూలి పనులు చేసుకుని జీవిస్తున్నారని వీరికి త్రాగునీటి సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వీరికి త్రాగు నీటి సౌకర్యార్థం మంచి నీటి బోరు వేసి ఆదుకోవాలని కోరారు, అలాగే వీరు నివసిస్తున్న పాతబడిన ఇండ్లు చిన్నచిన్న రిపేర్లు చేసుకుంటూ, ఇండ్లు కట్టుకుంటున్న పేదలపై కొంతమంది రెవెన్యూ అధికారులమని చెప్పి ఇండ్లు కట్టుకోనీయకుండా ఇబ్బంది పెడుతున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకొని ఈ పేదలను ఆర్డిఓ గారు ఆదుకొని న్యాయం చేయాలని వాళ్లను అన్ని విధాలుగా కాపాడాలని కోరారు ఈ కార్య క్రమం లో కాలనీ వాసులు ఇరముని తేజ, మణి, చిన్ని, కిరణ్, సాయి, సలీమాబీ, షామీర్ బాషా, విశాలాక్షీ, నాగమ్మ తదితరులు సుమారు వందమంది కాలనీవాసులు పాల్గొన్నారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: We need to provide drinking water and basic facilities to our Vyasaar colony

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page