యువకుల ఆత్మహత్యలకు సర్కారుదే బాధ్యత

0 12

హైదరాబాద్ ముచ్చట్లు:

రెండు నెలలుగా నోటిఫికేషన్ పై ప్రకటనలు చేస్తోంది ప్రభుత్వం. 56వేల ఖాళీల భర్తికి నోటిఫికేషన్ వస్తుందని నిరుద్యోగులు భావించారు. క్యాబినేట్ లో 56వేల ఉద్యోగా చర్చ జరగలేదు.. దాని చర్చపై ఒక్క ప్రకటన కూడా వినిపించలేదని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ప్రభుత్వం ఆశ చూపించడంతో నగరానికి యువకులు తరలి వచ్చారు. ప్రభుత్వం తీరుతో యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి బాధలు చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది.. ప్రభుత్వం హృదయం కరుగుతుంది. అబద్దాలలో అందవేసిన చెయ్యి ప్రభుత్వ పెద్దలది.. వారిని గిన్నీస్ బుక్ రికార్డ్స్ లో ఎక్కించాలి. 15వేల ఉద్యోగాల లిస్ట్ ను కేటీఆర్ బయట పెట్టాలి. ఎక్కడ ఇచ్చారు.. ఎవరికి ఇచ్చారో వెంటనే చెప్పాలి. ఇలాంటి అబద్దాలు ఆడి యువకులను మోసం చేయొద్దు. యువకులను కాపాడుకోలేని సమాజానికి భవిష్యత్ ను నిర్మించే శక్తి లేనట్టేనని అయన అన్నారు.  తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి మరో యువకుడు ఆత్మ హత్య చేసుకున్నారు. ప్రభుత్వ చేతగాని తనం వల్లనే ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అయన అన్నారు.

 

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags:The government is responsible for the suicides of young people

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page