రాజీనామాలతో నిధులు రావు

0 10

భుపాలపల్లి  ముచ్చట్లు:
సోమవారం నాడు భూపాలపల్లి ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో శాసన సభ సభ్యుడు గండ్ర వెంకట రమణా రెడ్డి మాట్లాడారు. ఒక్క పక్క కరోనా కష్ట కాలంలో ప్రజలకు మేమున్నాం అంటూ ప్రజలకు ధైర్యంగా ఉండమని  నిరంతరం ప్రజల మధ్య ఉన్నది మేము. నిన్నటి వరకు ఎక్కడ ఉన్నారో తెలియని వారు ఉనికి తెలియపరచడం కొరకు చిల్లర రాజకీయాలు చేస్తూ… ఎమ్మెల్యే  రాజీనామా చేస్తే నే సంక్షేమ పధకాలు, నిధులు వస్తాయి అనేది అపోహ మాత్రమేనని అన్నారు. అభివృద్ది అనేది నిరంతర ప్రక్రియ.   అందులో భాగంగానే ప్రతి ఒక్క కుల వృత్తులను ప్రోత్సహించడం జరుగుతుంది. నిన్న సుదీర్ఘంగా జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో రజకులు,నాయి బ్రాహ్మణుల వారి యొక్క షాపులకు ఉచిత కరెంట్ ప్రకటిస్తూ .ఈవో  జారీ చేయడం జరిగింది. ఆదే విధంగా 50,000 వేల రుణమాఫీ ని, 57 సంవత్సరాల వారికి పెన్షన్ లు కూడా ఇవ్వడం జరుగుతుంది. కరోనా సమయంలో పక్క రాష్ట్రాల నుంచి గొర్రెల ను తీసుకురావటం కష్టం కావటం వల్ల యాదవ సోదరులకు రూ.1,70,000/- లను చేయూత ఇచ్చామని అన్నారు.
ముదిరాజ్ సోదరులకు చెరువులో చేపలు వారే పట్టుకోవటానికి జీవో విడుదల చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా అనగారిన దళితుల సంక్షేమం కోసం దళిత బంధు అనే సంక్షేమ కార్యక్రమాన్ని మొదటి విడతగా 250 కోట్లను విడుదల చేస్తూ పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ కేంద్రంగా చేసుకొని మొదలు పెడుతున్నారని అన్నారు.
ఈ సందర్భంలో హుజూరాబాద్ నియోజక వర్గం లోని కొంతమంది ఇది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన పథకం ఎన్నికల తర్వాత తిరిగి ముగిస్తుంది అని హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. దళిత బంధు పథకం గురుంచి కొంత మంది రాజకీయ నాయకులు ఎన్నికల స్కీం అని అంటున్నారు.  కానీ ఎన్నో పథకములు తీసుకోచ్చారు కానీ ఎలాంటి పథకాలు ఎన్నికల తర్వాత  తీసివేయలేదు. అదే విధంగా ఉద్యోగుల ట్రాన్స్ఫర్ విషయంలో గాని,పోస్టింగ్ విషయం లో గాని ఇంతవరకు నేను పారదర్శకంగా చేయడం జరితుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి  బాటలో నడుస్తూ భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి కొరకు పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్  సేగ్గెం వెంకట రాణి సిద్దూ, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు,టౌన్ పార్టీ ప్రెసిడెంట్ సాంబమూర్తి, టౌన్ యూత్ ప్రెసిడెంట్ బుర్ర రాజు, కౌన్సిలర్ లు ధార పూలమ్మ,శిరుప అనిల్, ముంజల రవీందర్, మురళి, నూనె రాజు,తిరుపతి, బద్ధి సమ్మయ్య, హనుమాన్ టెంపుల్ చైర్మన్ గడ్డం కుమార్ రెడ్డి,కో ఆప్షన్ సభ్యులు దొంగల అయిలయ్య,వజ్రమణి,జిల్లా నాయకులు రఘుపతి రావు, బుర్ర రమేష్,దేవేందర్, బండారి రవి,రాజలింగ మూర్తి,దేవేందర్ రెడ్డి,బీబీ చారి,గండ్ర యువసేన నాయకులు శ్రీకాంత్,రఘు రెడ్డి, , బడితల సమ్మయ్య, రత్నం సమ్మిరెడ్డి, రాజిరెడ్డి,రఘోత్తం రెడ్డి, దేవేందర్,మహిళ నాయకురాలు వాసాల స్వప్న, తిరుపతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

- Advertisement -

Tags:Funds do not come with resignations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page