రైతులు సాగుచేసిన ప్రతి పంటకు ఈ- క్రాపింగ్ తప్పనిసరి-ఏడిఏ మహమ్మద్ ఖాద్రి

0 2

తుగ్గలి ముచ్చట్లు:

 

మండల వ్యాప్తంగా రైతులు సాగుచేసిన ప్రతి ఒక్క పంటకు ఈ క్రాపింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలని పత్తికొండ ఎడిఎ మహ్మద్ ఖాద్రి తెలియజేశారు.ఈ సందర్భంగా సోమవారం రోజున మండల కేంద్రమైన తుగ్గలిలోని స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయం నందు వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ క్రాపింగ్ పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సోమవారం రోజున వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహిస్తున్న పంట నమోదు ప్రక్రియను ఏడిఏ మరియు ఏవో లు పరిశీలించారు.ఈ సందర్భంగా ఏ డి ఏ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతు సాగు చేసిన తమ పంటలను వ్యవసాయ అధికారుల ద్వారా నమోదు చేయించుకోవాలని అని తెలియజేశారు.ఈ క్రాప్ బుకింగ్ అనంతరం రైతులు తమ పరిధిలోని రైతు భరోసా కేంద్రానికి వెళ్లి 1బి జిరాక్స్,మొబైల్ నెంబర్,ఆధార్ కార్డు లను పొలం ఉన్న రైతు తీసుకొని వెళ్లి సాగుచేసిన పంటను నమోదు చేసుకోవాలని తెలియజేశారు.ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్న రైతులకు మాత్రమే పంటల బీమా,రైతు భరోసా,క్రాప్ లోన్ మరియు పంట నష్టపరిహారం వంటి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని ఆయన తెలియజేశారు. ఈ క్రాప్ చేసుకొని రైతులకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు వర్తించవని ఆయన తెలియజేశారు. కావున రైతులందరూ త్వరితగతిన పంట నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి పవన్ కుమార్, హబ్ ఏవో రామాంజనేయులు,హబ్ ఏఈఓ సంజీవ్ కుమార్,వ్యవసాయ విస్తరణాధికారులు రంగన్న,లక్ష్మీ చైతన్య,ఎంపీఈవో లు,విఏఏ లు, విహెచ్ఎ లు మరియు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: E-cropping is mandatory for every crop grown by farmers-ADA Mohammad Qadri

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page