వాట్సాప్‌కు పోటీగా ‘సందేశ్‌’.. లాంచ్ చేసిన కేంద్రం

0 28

 

న్యూఢిల్లీముచ్చట్లు:

 

- Advertisement -

ప్రముఖ ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. సందేశ్‌గా నామకరణం చేసిన ఈ యాప్‌ గురించి కేంద్ర సహాయ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్‌సభలో వివరించారు. సందేశ్‌కు సంబంధించిన విశేషాలను లిఖిత పూర్వకంగా అందజేశారు. ‘సందేశ్ ఓపెన్ బేస్డ్ యాప్. ఇది చాలా సురక్షితమైనది. క్లౌడ్ ఎనేబుల్ అయిన ఈ యాప్‌కు సంబంధించిన కంట్రోల్‌ను ప్రభుత్వమే చూసుకుంటుంది. వన్ టూ వన్ మెసేజింగ్, గ్రూప్ మెసేజింగ్, ఫైల్, మీడియా షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్, ఈ గవర్నమెంట్ అప్లికేషన్‌ లాంటి ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నాయి.గూగుల్ ప్లే స్టోర్‌తోపాటు యాప్ స్టోర్‌లో కూడా దీన్ని అందుబాటులో ఉంచుతున్నాం’ అని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.వాట్సాప్‌లా పని చేసే సందేశ్‌ను నేషనల్ ఇన్ఫోర్‌మెటిక్స్ సెంటర్‌ (ఎన్‌ఐసీ) డెవలప్ చేసింది. ఎన్‌ఐసీతోపాటు ప్రభుత్వ ఐటీ వింగ్ కలసి ఈ యాప్‌ను లాంచ్ చేశాయి. మొబైల్ నెంబర్‌తోపాటు ఈమెయిల్ ఐడీతోనూ కమ్యూనికేట్ చేసుకునేలా సందేశ్‌ను డిజైన్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సర్కారు ఏజెన్సీలు వాడుతున్న ఈ యాప్‌ ఇప్పుడు ఇది అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నాక.. ఫోన్ నంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ వెరిఫికేషన్ చేస్తే చాలు యాప్‌ను వినియోగించుకోవచ్చు..

 

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags:’Message’ as a competition to WhatsApp .. Launched Center

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page