సజ్జలను , మంత్రి బాలినేని లను కలిసిన కోటం రెడ్డి బ్రదర్స్

0 3

నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లాకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు  సజ్జల రామకృష్ణా రెడ్డి, అటవీ, విద్యుత్ శాఖ  మరియు జిల్లా ఇంఛార్జ్ మంత్రి  బాలినేని శ్రీనివాస రెడ్డి లను సోమవారం ఆర్ & బి అతిథిభవనంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిరువురిని పుష్పగుచ్చం అందజేసి , శాలువాతో సత్కరించారు. ఈ ఈ సందర్భంగా నెల్లూరు నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. అదేవిధంగా జిల్లా అభివృద్ధికి తోడ్పాటు వివిధ ప్రాజెక్టులు, పరిశ్రమలు మంజూరు చేసినట్లయితే జిల్లాలోని నిరుద్యోగ యువత శాతాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయమై మంత్రులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అభినందనీయమని ప్రభుత్వ సేవలను కొనియాడారు. రానున్న ఎన్నికల నాటికి నెల్లూరు గ్రామీణ నియోజవర్గ లో లో వైకాపాకు తిరుగులేని మెజారిటీ తీసుకురావడమే లక్ష్యంగా నూతన చేరికలు మరియు మార్పులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

- Advertisement -

Tags:Kotam Reddy Brothers met Sajjala and Minister Balineni

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page