సరే.. కొలువులు ఎప్పుడూ

0 12

హైదారాబాద్    ముచ్చట్లు:
నిధులు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ ఆవిర్భవించింది. రాష్ట్ర ప్రభుత్వానికి నీళ్లు, నిధులపై ఉన్న శ్రద్ధ నియామకాలపై లేదని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో 50 వేల కొలువులను వెంటనే భర్తీ చేస్తామని ప్రభుత్వం హడావుడి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలను సైతం సేకరించారు. నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించారు. ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచారు. ఆ తర్వాత 50 వేల కొలువుల భర్తీ ప్రక్రియను సర్కారు మరిచిపోయింది. హుజురాబాద్‌ ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గతనెలలో ఖాళీ పోస్టుల భర్తీపైనే ప్రత్యేకంగా మంత్రివర్గం ఏర్పాటు చేసి ఎన్నడూలేని విధంగా రెండురోజులపాటు చర్చించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 28 శాఖల పరిధిలో 56,979 ఖాళీ పోస్టులున్నాయని అధికారులు వివరించారు. రాష్ట్రంలో కొత్త జోనల్‌ విధానానికి సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులను కేంద్రం ఆమోదించింది. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం ఖాళీల భర్తీకి ఎలాంటి ఆటంకాల్లేవు. అయినప్పటికీ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం గమనార్హం. దీంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

 

కొలువుల భర్తీకి క్యాలెండర్‌ ప్రకటించాలనీ, నిర్దిష్ట కాలపరిమితిలోగా నియామకాలు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని యువజన సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఆదివారం మంత్రివర్గ సమావేశం ఉన్నది. ఖాళీలపై మళ్లీ చర్చించి నిర్ణయం ప్రకటించే అవకాశమున్నట్టు తెలిసింది.రాష్ట్రంలో మొత్తం 4,91,304 ఉద్యోగాలు మంజూరయ్యాయి. ప్రస్తుతం 3,00,178 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఆర్‌ బిశ్వాల్‌ నేతృత్వంలోని పీఆర్సీ కమిటీ నివేదికలో ప్రకటించింది. అయితే కాంట్రాక్టు ఉద్యోగులు 50,400 మంది, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు 58,128 మంది కలిపి 1,08,528 మంది పనిచేస్తున్నారని వివరించింది. పీఆర్సీ నివేదిక ప్రకారం విద్యాశాఖలో 23,798, హోంశాఖలో 37,182, వైద్య ఆరోగ్య శాఖలో 30,570, రెవెన్యూ శాఖలో 7,961, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో 12,628 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను మినహాయించినా రాష్ట్రంలో 82,598 ఖాళీ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుంది. హోంశాఖలో 21,507, వైద్య ఆరోగ్య శాఖలో 10,048, ఉన్నత విద్యలో 3,825, బీసీ సంక్షేమ శాఖలో 3,538, ఎస్సీ డెవలప్‌మెంట్‌ శాఖలో 1,967, పాఠశాల విద్యలో 1,384 చొప్పున వివిధ శాఖల్లో 56,979 పోస్టులే ఖాళీగా ఉన్నాయని ఇటీవల మంత్రివర్గం తేల్చింది. దీని ప్రకారం పీఆర్సీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇక పాఠశాల విద్యాశాఖలో 13 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్రానికి వివరాలు పంపించింది. కానీ మంత్రివర్గానికి మాత్రం 1,384 ఖాళీలే ఉన్నాయని విద్యాశాఖ అధికారులు వివరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియను చేపట్టడం కోసమే ఖాళీలను చూపలేదన్న అభిప్రాయం వినిపిస్తున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు రావడం లేదని నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయినా ప్రభుత్వం చలనం రావడం లేదని నిరుద్యోగులు వాపోతున్నారు.తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల కాలేదు. గతంలోనే టీఎస్‌పీఎస్సీ ద్వారా 128 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్త జోనల్‌ విధానానికి ఆమోదముడ్ర పడింది. ఆ పోస్టులను పెంచి కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశమున్నట్టు తెలిసింది.

 

- Advertisement -

ఇక గ్రూప్‌-2లో 60, గ్రూప్‌-3లో 400 పోస్టులు భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నది. ఒకవైపు కొలువుల్లేవు, ఇంకోవైపు నిరుద్యోగ భృతి ఊసేలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీల ప్రకారం 30 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించింది. ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 61 ఏండ్లకు పెంచింది. కానీ నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగ నియామక వయో పరిమితిని మూడేండ్లు పెంపు, నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీలను ప్రభుత్వం విస్మరించింది. దీంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇంకోవైపు వయోపరిమితి సడలింపు 2019, జులై 26న ముగిసింది. అప్పటి నుంచి వయోపరిమితి పెంపు కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. వయోపరిమితి సడలింపు ఉత్తర్వులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్‌ చేస్తున్నారు.రాష్ట్రంలో వివిధ శాఖల్లోని ఖాళీ పోస్టుల భర్తీ పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎన్నికల్లో నిరుద్యోగుల ఓట్లు దండుకోవడానికి ప్రకటనలు చేస్తున్నది. ఇది మోసం చేయడమే. నాటకాలు మానుకుని చిత్తశుద్ధి ఉంటే హుజురాబాద్‌ ఉప ఎన్నికలకు ముందే ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలి. ప్రజాప్రతినిధుల పోస్టులను ఖాళీ అయిన ఆర్నెల్లలోపు భర్తీ చేస్తున్నపుడు ఖాళీ అయిన ఉద్యోగాలను ఆర్నెల్లలోపు ఎందుకు భర్తీ చేయడం లేదు?. రాజకీయ నిరుద్యోగాన్ని పోగొట్టడంలో ఉన్న చిత్తశుద్ధి, నిజమైన నిరుద్యోగాన్ని పోగొట్టడంలో ప్రభుత్వానికి లేదు. నిరుద్యోగుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుంది.

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

Tags:OK .. scales never

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page