సింధూరానికి ఉభయ సభల్లో అభినందనలు

0 18

న్యూఢిల్లీ   ముచ్చట్లు:
ఒలింపిక్స్‌లో పథకం సాధించిన తర్వాత తొలిసారి పీవీ సింధు మీడియా ముందుకు వచ్చారు. ఒలింపిక్ పథకం గెలవడం సంతోషంగా ఉందన్నారు. పథక విజయాన్ని అందరితో పంచుకున్నారు. తన అనుభవాలను.. పోరాట తీరును వివరించారు పీవీ సింధు. గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ తనకు ఎంతగానో ఉపయోగపడిందన్నారు పీవీ సింధు. కరోనా సమయంలో తన బలహీనతలపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. తనకు శిక్షణ ఇచ్చేందుకు కోచ్ పార్క్ ఎంతగానో కష్టపడినట్టు తెలిపారామె. ఈ ఒలింపిక్స్ లో ఇంత వరకూ రావడానికి ప్రస్తుత కోచ్ ఎంతో కృషి చేశారని అభినందించారు పీవీ సింధు. అక్కడ కోచింగ్ వాతావరణం.. ట్రైనింగ్ తీరు తనకు ఎంతగానో ఉపయోగడ్డాయన్నారు.ఒలింపిక్స్‌లో సత్తా చాటిన పీవీ సింధుకు అభినందనలు తెలిపింది పార్లమెంట్‌. వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో మెడల్‌ సాధించి చరిత్ర సృష్టించిందని ప్రశంసించారు లోక్ సభ స్పీకర్‌ ఓం బిర్లా. ఒలింపిక్స్‌లో బ్రాంజ్‌ మెడల్‌ గెలవడం దేశానికే గర్వకారణమన్నారు. మున్ముందు ఆమె మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు.ఇక ఇటు రాజ్యసభలోనూ పీవీ సింధు ప్రతిభను కొనియాడారు ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు. దేశంలోని ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచిందన్నారు. చిన్నప్పటి నుంచి తీవ్రంగా శ్రమించి ఈ స్థాయికి చేరుకుందని..ఇందుకు ఆమె తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రోత్సహించారని ప్రశంసించారు.

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

- Advertisement -

Tags:Congratulations to Sindoora in both houses

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page