సినీ నిర్మాతకు రూ.5 కోట్ల జరిమానా..జైలు

0 15

బెంగళూరు ముచ్చట్లు :

 

శాండల్‌వుడ్‌ నిర్మాత కె.సుధాకర్‌కు రూ.5 కోట్ల జరిమానాతో పాటు ఏడాది జైలుశిక్ష ఖరారైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కథా విచిత్ర, హులిదుర్గ వంటి సినిమాలు నిర్మించిన సుధాకర్‌పై మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. హాసన్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త నుంచి ఆయన రూ.2.90 కోట్లు రుణం తీసుకున్నారు. లే అవుట్‌ నిర్మాణాల కోసం అప్పు చేసి ఆ సొమ్ముతో సినిమాలకు పెట్టుబడి పెట్టి నిర్మించిన సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ లభించలేదు. దీంతో సమయానికి అప్పులు చెల్లించలేకపోయారు. రాజీ చేసుకున్న సుధాకర్‌ చెక్కులు ఇచ్చారు. అవి బౌన్స్‌ కావడంతో హాసన్‌లోని నాల్గవ జేఎంఎఫ్‌సీ కోర్టును ఆశ్రయించారు. 2020 జనవరి 27న కోర్టు శిక్షను ఖరారు చేసి తీర్పునిచ్చింది.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags; Film producer fined Rs 5 crore, jailed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page