హెలికాప్టర్‌ కూలి నలుగురి మృతి

0 15

కాలిఫోర్నియా ముచ్చట్లు :

 

ఉత్తర కాలిఫోర్నియాలో హెలికాప్టర్‌ కూలిపోయిన ఘటన విషాదాన్నినింపింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కేఎస్‌టీవీ స్టేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ధ్రువీకరించింది. ది రాబిన్​సన్​ ఆర్​66 అనే హెలికాప్టర్ ఆదివారం మధ్యాహ్నం 1.15 సమయంలో శాక్రమెంటోకు ఉత్తరాన కొలూసా కౌంటీలో ప్రాంతంలో కుప్పకూలింది. ఈ మేరకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించిన విషయాన్ని ధృవీకరించినప్పటికీ, మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం నలుగురు వ్యక్తులు చనిపోయినట్టుగా తెలుస్తోందని అధికారులు తెలిపారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags; Four killed in helicopter crash

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page