అక్రమ నిర్మాణాల కూల్చీవేత

0 11

సంగారెడ్డి ముచ్చట్లు :
కోర్టు ఉత్తర్వుల మేరకు జాతీయ రహదారి పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను  పంచాయతీరాజ్ అధికారులు.  భారీ  బందోబస్తు మధ్య తొలగించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగి జాతీయ రహదారి పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చీవేసారు.  ఈ సందర్భంగా డిఎల్పీఓ సతీష్ రెడ్డి మాట్లాడుతూ ముత్తంగి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 523,522,588 లలో ఉన్న అక్రమ నిర్మాణాలను హై కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేస్తున్నామని, ఈ నిర్మాణాలకు ఎన్నో సార్లు నోటీసులు జారీ చేసిన కూడా ఎలాంటి రిప్లై ఇవ్వలేదని అన్నారు. 7901 కేసునెంబర్ ఇచ్చిన తీర్పు ఎందుకు అమలు చేయట్లేదని గ్రామ పంచాయతీ పై కంటేప్ట్  కేసుకుడా అయ్యిందని తెలిపారు. 067 జీవో ప్రకారం హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు 10 జేసీబీలతో 20 ట్రాక్టర్ల సహాయంతో భారీ  బందోబస్తుతో కూల్చివేస్తున్నామని అన్నారు. ఈ రహదారి పైన ఉన్న మిగతా నిర్మాణాలకు కూడా నోటీసులు జారీ చేసి వాటిని కూడా కూల్చివేస్తామని తెలిపారు, ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీలు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

- Advertisement -

Tags:Demolition of illegal structures

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page