అస్సోం మహిళా కాళికావతారం

0 22

గౌహాతి ముచ్చట్లు :

 

ప్పుడైతే అర్ధరాత్రి కూడా ఆడది ఒంటరిగా రోడ్లపై నడుస్తుందో అప్పుడే మనకు స్వాతంత్ర్యం వచ్చినట్టు’’ అని పెద్దలు అంటారు. దీని ప్రకారం చూస్తే.. స్వాతంత్ర్యం కాదు కదా.. పట్టపగలు ఒంటరిగా తిరిగే స్వేచ్ఛ కూడా లభించలేదని చెప్పుకోవచ్చు. మహిళలను చులకగా చూసే మగాళ్లు ఉన్నంత వరకు ఈ సమాజం ఇలాగే ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోడానికి మహిళలు ధైర్యంగా ఉండాలి. ఆత్మరక్షణ కోసం.. వీలైతే తిరగబడాలి. దాడి చేసే వ్యక్తులకు చుక్కలు చూపించాలి. అస్సాంకు చెందిన ఈ యువతి ఆ పనే చేసింది. తన వక్షోజాలను అసభ్యంగా తాకిన ఆకతాయిని రోడ్డుకు ఈడ్చింది.గౌహతీకి చెందిన భావన కాశ్యాప్ ఓ వీధిలో నుంచి నడుచుకుని వెళ్తుండగా.. యాక్టీవా స్కూటర్ మీద వచ్చిన ఓ యువకుడు ఆమెను సినాకీ పాత్‌కు చిరునామా అడిగాడు. దీంతో భావన తనకు ఆ అడ్రస్ తెలియదని అతడికి చెప్పింది. తనకు ఏమీ వినిపించడం లేదని, కాస్త దగ్గరకు వచ్చి చెప్పని ఆ యువకుడు అన్నాడు. దీంతో ఆమె అతడికి దగ్గరగా వెళ్లింది. అంతే.. అతడు ఒక్కసారే ఆమె వక్షోజాలను పట్టుకున్నాడు. అతడు చేసిన పనికి షాకైన ఆమె.. తన ఉగ్రరూపాన్ని చూపించింది. స్కూటర్‌తో సహా అతడిని పక్కనే ఉన్న డ్రైనేజీలోకి తోసేసింది. దీంతో అతడు డ్రైనేజీలో ఇరుక్కున్న స్కూటర్ బయటకు తీయడానికి ముప్పు తిప్పలు పడ్డాడు.

 

 

 

- Advertisement -

ఈలోగా ఆమె గట్టిగా కేకలు పెడుతూ చుట్టుపక్కల జనాన్ని పిలిచింది. జరిగిన విషయాన్ని వారికి చెప్పింది. ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి ఆ యువకుడి పరువు తీసింది.అతడు నాతో అసభ్యంగా ప్రవర్తించి అక్కడి నుంచి పారిపోడానికి ప్రయత్నించాడు. వెంటనే నేను అతడి స్కూటర్ వెనుక టైరును పైకి లేపాను. దీంతో అది ముందుకు వెళ్లలేదు. ఆ తర్వాత దాన్ని డ్రైనేజీలోకి తోసేశాను’’ అని తన ఫేస్‌బుక్ పేజీలో పేర్కొంది. అతడి పేరు మధుసనా రాజ్‌కుమార్ అని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలను పోస్ట్ చేసింది. దీంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని అతడిని అరెస్టు చేశారు. నెటిజనులు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే ఆమె తరహాలోనే గట్టిగా సమాధానం ఇవ్వాలని అంటున్నారు.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Assam is a female incarnation

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page