ఆన్ లైన్ రోమియో బెండు తీసిన కడప పోలీసులు

0 21

కడప ముచ్చట్లు :

 

ఆన్ లైన్లో పరిచయమైన మహిళలను, అమ్మాయిలను మోసం చేస్తున్న కడప జిల్లా యువకుడు చెన్నుపల్లి ప్రసన్నకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసన్నకుమార్ బీటెక్ ఫస్టియర్ లోనే చదువుకు డుమ్మా కొట్టాడు. విలాసాలకు అలవాటు పడిన అతడు డబ్బు కోసం చోరీల బాటపట్టాడు. చెయిన్ స్నాచింగ్ లు, ఇళ్లలో చోరీలు చేసి జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఆపై శ్రీనివాస్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పరిచయం కాగా, అతడికి సైతం టోకరా వేశాడు. ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు తీసుకుని పత్తా లేకుండా పోయాడు. ఆ తర్వాత ప్రసన్నకుమార్ ను కడప పోలీసులు ఓ దొంగతనం కేసులో అరెస్ట్ చేయగా, విచారణలో అతడిలోని మరో కోణం బయటపడింది. ఆన్ లైన్ లో అమ్మాయిలు, మహిళలతో పరిచయం పెంచుకుని, వారికి నమ్మకం కుదిరాక వారి నగ్న, అర్ధనగ్న ఫొటోలు, వీడియోలు సేకరించేవాడు. ఆపై వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు రాబట్టేవాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు… ఏకంగా 200 మందికి పైగా అమ్మాయిలు, మహిళలు ప్రసన్నకుమార్ బారినపడ్డారు. ప్రసన్నకుమార్ నుంచి రూ.1.26 లక్షల నగదు, 30 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Kadapa police take online Romeo Bendu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page