ఎండిపోయిన హరితహారం మొక్కలు

0 24

యాదాద్రి భువనగిరి ముచ్చట్లు:

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమంలో పేపర్ పైన మాత్రమే లక్షల రూపాయల విలువచేసే మొక్కలు పెంచారు.  ఆలేరు మున్సిపల్ అధికారులు. సుమారు 70 లక్షలు వెచ్చించి తెచ్చిన మొక్కలు మున్సిపల్ ఆఫీస్ వెనకాల నిర్లక్ష్యంగా పడేసారు.  వాటికి నీళ్లు వేయకపోవడంతో మొక్కలు ఎండిపోగా మరి కొన్ని మొక్కల్లో నాణ్యత కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. నర్సరీలలో రిజెక్ట్ చేసిన మొక్కలను మున్సిపాలిటీ పరిధిలో నాటేందుకు తీసుకురావడం…. ఆ మొక్కలను ఇంటింటికి పంచడంపట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని అధికారుల నిర్లక్ష్యానికి, హరితహారం కార్యక్రమంపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ చైర్మన్ అసమర్థత, అధికారుల నిర్లక్ష్యం వల్లే లక్షలు వెచ్చించి తెచ్చిన మొక్కలు అసలు లక్ష్యానికి చేరుకోవడం లేదని…. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Dried evergreen plants

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page