ఎమ్మెల్యే వాసుపల్లి పార్టీ పరువు తీస్తున్నారు

0 21

విశాఖపట్నం ముచ్చట్లు :

విశాఖలో అక్రమనిర్మాణాల తొలగింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.జీవీఎంసీ అధికారు లు తొలగించే క్రమంలో స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వ్యవహారించిన తీరుపై 39 వ వార్డు కార్పొరేటర్ సాదిక్ ఘాటుగా స్పందిం చారు.జివిఎంసీ ఎన్నికల ముందు నుంచి ఎవిడిఎమ్ స్కూల్ పక్కన ఉన్న దుకాణాలు తొలగించాలని పిర్యాదు లు ఉన్నాయని,తాను కార్పొరేటర్ గా గెలిచిన తరువాత కూడా తనకు పలువురు పిర్యాధు చేశారని తెలిపారు. దింతో జివిఎంసీకి వారికి పిర్యాదు చెయ్యడంతో వారికి రెండు సార్లు నోటీసులు ఇచ్చారని, వేరే ప్రాంతంలో దుకాణాలు పెట్టకోవడానికి అనుమతి ఇచ్చారు అయిన ఖాళీ చేయ్యలేదని అన్నారు.దీనితో జివిఎంసీ దుకాణాలు కూల్చివేశారని అన్నారు.అయితే దీనిపై ఎమ్మెల్యే హీరో మాదిరిగా హడావుడి చేసారని, పార్టీలో ఉండి పార్టీ వ్యతిరేక కార్యక్ర మాలు చేస్తున్నారని, దక్షిణ నియోజక వర్గంలో ఓ వర్గం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుందని చెప్పారు. రెండేళ్ల లో ఏ అభివృద్ది జరగలేదని వాసుపల్లి అనడం బాదకరమని,దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్ల అందం కలసి విజయసాయి రెడ్డి ని కలుస్తా మని తెలిపారు.వాసుపల్లి పార్టీ లో ఉంటు పార్టీ పరువు తీస్తున్నారని అన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:MLA Vasupalli is defaming the party

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page