కేసీఆర్  పరుగో.. పరుగు.. మేం గెలిచాం

0 11

హైదరాబాద్ ముచ్చట్లు :

 

మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. సోషల్ మీడియా వేదికగా ఆమె సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్‌లో నయానో భయానో గెలవాలని టీఆర్ఎస్ చూస్తోందన్నారు. అయితే ఇప్పటికే ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నైతిక ఓటమి పాలైందని ఆమె వ్యాఖ్యానించారు. ‘‘ఎన్నికల కమిషన్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సంసిద్ధతపై ప్రశ్నిస్తే తమ వల్ల కాదని కేసీఆర్ గారి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుని మంచి గాలప్ మీద భాగ్ మిల్కా లెక్క ఉరుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు టీఆర్ఎస్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు విజయశాంతి.గతంలో కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాలు ఎంత చెప్పినా వినకుండా మిలియన్ల సంఖ్యలో ఓటర్లు పాల్గొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, కార్పోరేషన్ ఎన్నికలు నిర్వహించిన ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కేవలం 100కు పైన ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు చెయ్యవలసిన ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పించుకుని వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేవలం హుజురాబాద్ ఎన్నిక వస్తుందన్న భయంతో మాత్రమే… ఇంకా సమయం దొరికితే మరిన్ని మోసపు పథకాలు తెచ్చి, నాయకులను కొనుగోలు చేసి, బీజేపీ కార్యకర్తలను ఒత్తిళ్ళకు గురి చేసే విధంగా కేసులు, వేధింపులు చేపట్టి, ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారని విజయశాంతి విమర్శించారు.ఎలాగైనా గెలవాలన్న దుర్మార్గపు ఆలోచనలో భాగంగానే ఈ పలాయనవాదాన్ని ప్రస్తుతానికి అడ్డు పెట్టుకున్నట్లుంది. ఈ పనులన్నిటి ద్వారా ఇప్పటికే జనం దృష్టిలో తేలికైపోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం మరింత నవ్వుల పాలు కాక తప్పదు. ఎన్నిక ఎప్పుడు వచ్చినా హుజురాబాద్‌లో ఈటల గారి గెలుపు, టీఆర్ఎస్ ఓటమి ఖాయం. ఇప్పటిదాంకా చేసిన, చేస్తున్న అరాచక కార్యాచరణ వల్ల టీఆర్ఎస్ ఇప్పటికే ఆ నియోజకవర్గంలో నైతిక ఓటమి పాలైంది’’ అని రాములమ్మ పేర్కొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: KCR run .. run .. we won

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page