కేసీఆర్ శవయాత్ర

0 8

భువనగిరి ముచ్చట్లు :
రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు నిరసనగా యాదాద్రి భువనగిరి  జిల్లా భువనగిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టి బొమ్మ  తో  శవ యాత్ర నిర్వహించారు.డప్పుచప్పుళ్లతో  స్థానిక ప్రిన్స్ చౌరస్తా నుంచి  వినాయక్ చౌరస్తా  వరకు కెసిఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. వినాయక చౌరస్తా లోని అంబెడ్కర్ విగ్రహం ముందు కెసిఆర్ దిష్టిబొమ్మకు నిప్పు పెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పొత్నాక్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ నిరుద్యోగులు అధైర్యపడొద్దని కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో కెసిఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలని పిలుపుని చ్చారు. వెంటనే లక్షా యాభై వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫి కేషన్ లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

- Advertisement -

Tags:KCR Funeral

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page