గోదావరి బోర్డు మీటింగ్… తెలంగాణ డుమ్మా

0 9

హైదరాబాద్   ముచ్చట్లు :

గోదావరి, కృష్ణా బోర్డుల సంయుక్త సమన్వయ కమిటీ సమావేశం అయింది.అయితే ఈ భేటీకి తెలంగాణ అధికారులు డుమ్మ కొట్టారు. హైదరాబాద్ లోని జలసౌధలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర జలశక్తి బోర్డు, బోర్డు మెంబర్స్, ఏపీ ఈఎన్సీ, ట్రాక్స్ కో, జెన్ కో సీఎండీలు హాజరయ్యారు. అయితే ఈ భేటీకి తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారు. బోర్డు సమన్వయ కమిటీపై తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు.బోర్డు స్థాయి సమావేశం జరపాలని తెలంగాణ డిమాండ్ చేసింది. పూర్తిస్థాయి సమావేశం జరిపితే తమ అభ్యంతరాలు చెబుతామని తెలంగాణ తెలిపింది. ఈ సమావేశానికి ఏపీ అధికారులందరూ హాజరయ్యారు. ఈ కమిటీలోని మొత్తం 12 సభ్యులు హాజరుకావాల్సివుండగా తెలంగాణకు సంబంధించిన ముగ్గురు మాత్రం భేటీకి హాజరు కాలేదు. మొదటి నుంచి తెలంగాణ ఈ భేటీకి ఆసక్తికనబరచడం లేదు. తూతూ మంత్రంగా జరిగే సమావేశం కాబట్టి పూర్తిస్థాయి భేటీ జరిగితే హాజరవుతామని, ప్రభుత్వ అభ్యంతారాలు చెబుతామని అంటున్నారు.ఒక సారి బోర్డు పరిధిలోకి వెళ్లిన తర్వాత ఏం చేసే అవకాశం ఉండదు. బోర్డు పరిధి అనే విషయంలోనే తెలంగాణ మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో కేంద్ర జోక్యం అవసరం లేదు కాబట్టి ఈ అంశాలను కచ్చితంగా చర్చించిన తర్వాతే బోర్డు పరిధిని డిసైడ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

Tags:Godavari Board Meeting … Telangana Dumma

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page