గోదావరి ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన నూతన జాయింట్ కలెక్టర్

0 3

కుక్కునూరు  ముచ్చట్లు :

పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ బి.ఆర్ అంబేద్కర్, కె ఆర్ పురం  ఐటీడీఏ పీవో ఆనంద్ బాబు కుక్కునూరు మండలం లోని పోలవరం పొజెక్టు ముంపునకు గురి అవుతున్న 41.15 కంటూర్ పరిధిలో వున్నా కుక్కునూరు A బ్లాక్ మరియు గొమ్ముగూడెం, సీతారమపురం గ్రామాలను పరిశీలన చెయ్యటానికి రావటం జరిగింది. తరవాత గోదావారి ఒడ్డును గల గొమ్ముగూడెం గ్రామానికి వెళ్లి మొన్న వచ్చిన గోదావరి ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ వున్నా గృహాలను స్వయంగా పరిశీలించారు.అనంతరం గొమ్ముగూడెం ఊరిని అనుకుని ప్రవహిస్తున్న గోదావరి ప్రవాహ ఉద్రితని పరిశీలించారు 41.15 గ్రామాల సమస్యలను తెలియ చెయ్యటానికి కుక్కునూరు మండల వైయస్సార్సీపీ అధ్యక్షులు కుచర్లపాటి నర్సింహారాజు, కుక్కునూరు పంచాయితీ గౌరవ సర్పంచ్ రావు మీనా వినోద్, మరియు వైయస్సార్సీపీ సీనియర్ నాయకులూ మాదిరాజు వెంకన్న బాబు,కృష్ణమ్ రాజు,చిన్న నర్సింహ రాజు, మల్లేలా చంటి నాయుడు పగిల్లా అల్లేశ్ బృందం కలిసి 41.15 కంటూర్ పరిధిలో వున్నా నిర్వాసితులు పడుతున్న సమస్యలను వారి దృష్టికి తెసుకువెల్తూ ఆగస్ట్ సెప్టెంబర్ లో తీవ్రమైన గోదావరి వరదల ప్రమాదం పొంచివున్న నేపథ్యంలో వారిని గోదావరి వరదలకు ముందుగానే ర్&ర్ ప్యాకేజ్ పదిలక్షల చెల్లించి తాడువాయి లో నిర్మిస్తున్న ఆర్ అండ్ ఆర్ కాలనిలలో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయి లో కల్పించి పునరావాస కాలనిలకు తరలించాలని మరియు గతంలో ఉన్నటువంటి నిర్వాసితుల అర్హుల జాబితా నుండి వివాహం అయినది అని, ఇక్కడ ఉండటం లేదు అని మరియు చనిపోయారు అని నిజమైన అర్హులు అయిన నిర్వాసితులను పై కారణాల చేతా అసం బద్ధమైన వాట్సాప్ మేసేజులు వల్ల అన్యాయగా తొలగించారు. దీని వల్ల వాస్తవ నిర్వాసితులకు అన్యాయం జరిగింది.కాబట్టి వారి పేర్లను మొరొక్క సారీ లోతుగా పరిశీలిన చేసి అర్హుల జాబితాలోకి నమోదు చెయ్యాలి అని జాయింట్ కలెక్టర్ గారికి ఐటిడిఎ పీవో ఆనంద్ బాబుకి వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. సమస్య పై వెంటనే స్పందించిన జాయింట్ కలెక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పెండింగ్ లో ఉన్నటువంటి నిర్వాసితుల జాబితాను వెంటనే పరిశీలినా చేసి వారికీ న్యాయం చెయ్యాలి అని  ఆనంద్ బాబుని ఆదేశించారు. ఈసందర్భంగా ఐటిడిఎ పీవో   మాట్లాడుతూ 41.15 కంటూర్ లో వున్నా అవార్డ్  జరిగిన గ్రామాలకు బిల్లులు నమోదు చేస్తున్నాం అని గృహాల నిర్మాణం కూడా చివర దశకు చేరుకుంది అని గృహ నిర్మాణం పూర్తి అయిన వెంటనే ఆర్ అండ్ ఆర్ పరిహారం నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లో జమచేసిన తరువాతే పునరావాస కాలనిలకు తరాలిస్తాం అని  తెలిపారు. అదే విధంగా అన్ని ఆధారాలు వుండి అర్హుల జాబితాలో నమోదు కానీ అర్హులైన నిర్వసితులను పరిశీలన చేసి వారికీ కూడా న్యాయం చేస్తాము అని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా వారికీ నిర్వాసితులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుక్కునూరు  ఎమ్మార్వో రాజుకుమార్, కుక్కునూరు సీఐ దుర్గ ప్రసాద్, ఎస్ ఐ శ్రీనివాస్ ఆర్ఐయి, లు వి ర్ ఓ,లు, కుక్కునూరు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కుచ్చెర్లపాటి నరసింహ రాజు,రావు వినోద్, మాదిరాజు వెంకన్నబాబు,కుచ్చెర్లపాటి చిన నరసింహ రాజు, మల్లెల చంటి నాయుడు, అల్లేష్, నిర్వాసితులు,వైఎస్సార్సీపీ నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

Tags:New Joint Collector inspects Godavari floodplain

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page